Anaganaga Oka Raju USA Box Office: అమెరికాలో అనగనగా ఒక రాజు హవా.. నవీన్ పొలిశెట్టి మూవీకి ఎన్ని కోట్లంటే?

స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన అనగనగా ఒక రాజు వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. రిలీజ్‌కు ముందు నుంచే టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో నవీన్ పొలిశెట్టి సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ అమెరికాలోనూ అనగనగా ఒక రాజు మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నవీన్ పొలిశెట్టి మూవీకి నార్త్ అమెరికాలో ఎన్ని కోట్లు రాబట్టింది? ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంత అనే వివరాలు పరిశీలిస్తే..

అనగనగా ఒక రాజు బడ్జెట్
అనగనగా ఒక రాజు సినిమాలో రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ, సత్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీత దర్శకత్వం వహించారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటింగ్, చిన్మయి సంభాషణలు అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి అనగనగా ఒకరాజు చిత్రానికి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Anaganaga Oka Raju 3 Days Box Office Collections in Overseas North America UK Australia Revenue details Here

అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ బిజినెస్
అంచనాలకు తగిన విధంగానే అనగనగా ఒక రాజు చిత్రానికి రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 2.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 28 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అనగనగా ఒక రాజు బ్రేక్ఈవెన్
ప్రీ రిలీజ్ బిజినెస్‌ను బట్టి నవీన్ పొలిశెట్టి సినిమా లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల రూపాయల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అనగనగా ఒక రాజు చిత్రాన్ని ఏపీ, తెలంగాణలలో 800 స్క్రీన్స్‌లో.. కర్ణాటక + తమిళనాడులో 300 స్క్రీన్స్‌లో విడుదల చేశారు. ఓవర్సీస్‌లో అనగనగా ఒక రాజు మూవీ ఓవర్సీస్ రైట్స్‌ను మోక్షా మూవీస్ దక్కించుకుంది. ఇక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 14 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ఇక విదేశాల్లో ఈ సినిమాను 800 స్క్రీన్స్‌‌లో విడుదల చేశారు.

అనగనగా ఒక రాజు కలెక్షన్స్
నవీన్ పొలిశెట్టి మూవీకి తొలి రోజున ఇండియాలో 6.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 6.5 కోట్ల రూపాయలు చొప్పున 20.5 కోట్ల రూపాయల నెట్.. 23.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే అనగనగా ఒక రాజు చిత్రం రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 41.2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. దీనిని బట్టి మూడో రోజు నాటికే నవీన్ పొలిశెట్టి చిత్రం 50 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

అనగనగా ఒక రాజు యూఎస్ఏ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో నవీన్ పొలిశెట్టి మూవీ దుమ్మురేపుతోంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో సమానంగా బుకింగ్స్ నమోదు చేస్తోంది. శనివారం అడ్వాన్స్ సేల్స్‌లో చిరంజీవి సినిమా 130k డాలర్లు ( 1.17 కోట్ల రూపాయలు) వసూలు చేయగా... అనగనగా ఒకరాజు చిత్రం 115K డాలర్లు (104 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తాజాగా ప్రీమియర్స్‌తో పాటు నార్త్ అమెరికాలో ఈ చిత్రం 825K డాలర్లు (భారత కరెన్సీలో 7.48 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వీకెండ్ ముగిసేలోగా.. ఒక్క నార్త్ అమెరికాలోనే అనగనగా ఒక రాజు మూవీ 1 మిలియన్ డాలర్లు (దాదాపుగా 9 కోట్ల రూపాయలు) మార్క చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇప్పటికే గల్ఫ్, మిడిల్ ఈస్ట్, యూకే, యరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలలో వచ్చిన కలెక్షన్స్ కలిపి అనగనగా ఒకరాజు మూవీ ఇప్పటికే 10 కోట్ల రూపాయల మార్క్‌ను దాటినట్లుగా చెబుతున్నారు. మరి థియేట్రికల్ రన్ ముగిసేసరికి నవీన్ పొలిశెట్టి మూవీ ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X