Anaganaga Oka Raju Closing Collections: అనగనగా ఒక రాజు క్లోజింగ్ కలెక్షన్లు.. నవీన్ మూవీకి లాభమా? నష్టమా?
టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరో, హీరోయిన్లు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం అనగనగా ఒక రాజు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించార. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రం ద్వారా తొలి చిత్ర దర్శకుడిగా మారి పరిచయం అయ్యారు.
రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటర్‌గా, చిన్మయి సంభాషణలు అందించారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం జనవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? థియేట్రికల్ రన్‌లో ఈ మూవీ వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

రొమాంటిక్ లవ్ స్టోరీగా, పొలిటికల్ టచ్‌తో కంప్లీట్ రూరల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి ఊపు రావడం, ప్రేక్షకుల్లో జోష్ నింపడం ద్వారా చిత్ర యూనిట్ అంచనాలు పెంచారు. సంక్రాంతి పండుగ రేసులో భారీ పోటీ మధ్య రిలీజైన ఈ సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
వరుస విజయాలతో ట్రాక్ రికార్డు సెట్ చేసుకొన్న నవీన్ పొలిశెట్టి నటించిన ఈ చిత్రం రావడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. దాంతో ఈ సినిమా నైజాం హక్కులు 7 కోట్ల రూపాయలు, ఆంధ్రా హక్కులు 10 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 2.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సుమారుగా ఈ చిత్రం 30 కోట్ల షేర్ వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
అనగనగా ఒక రాజు చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 12.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 4.5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 7.5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 4 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.25 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 2.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 2 కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా 36 కోట్ల రూపాయల షేర్, 60 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక తెలుగేతర రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే.. కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1 కోటి రూపయాలు, మిగితా ప్రాంతాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో 67 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో 23 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 90 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. అయితే నిర్మాతలు మాత్రం 110 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించినట్టు అధికారికంగా ప్రకటించింది.


Click it and Unblock the Notifications











