Anaganaga Oka Raju Day 1 Box Office: షాకింగ్‌గా అనగనగా ఒక రాజు ఓపెనింగ్స్.. నవీన్ పొలిశెట్టి మూవీకి ఎన్ని కోట్
టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం అనగనగా ఒక రాజు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి తొలి చిత్ర దర్శకుడిగా మారి పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటర్‌గా, చిన్మయి సంభాషణలు అందించారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం జనవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ప్రమోషనల్ కంటెంట్ మూవీపై భారీ క్రేజ్ పెంచింది. ఈ క్రమంలో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా వసూలు చేసిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

పొలిటికల్ టచ్‌తో రూరల్ డ్రామాగా, లవ్, కామెడీ అంశాలను మేలవించి తొలి చిత్ర దర్శకుడు మారీ రూపొందించారు. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్లు పనిచేశారు. చిత్ర యూనిట్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 40 కోట్ల రూపాయలు మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి క్యూరియాసిటీ ఏర్పడింది. దాంతో భారీగా బిజినెస్ జరిగింది.
ఏజెంట్ సాయి శ్రీనివాస, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాల భారీ విజయం తర్వాత నవీన్ పొలిశెట్టి నటించిన ఈ చిత్రం రావడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. దాంతో ఈ సినిమా నైజాం హక్కులు 7 కోట్ల రూపాయలు, ఆంధ్రా హక్కులు 10 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 2.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత మొదలైన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్రాలో 1.5 కోట్ల రూపాయలు, తెలంగాణలో 1.25 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు అయ్యయి. కర్నాటకలో 25 లక్షలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియా వైడ్ మూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది.
ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వసత్ే.. 2015 లోకేషన్లలో 500 షోలును ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 15 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో 350K డాలర్లు అంటే..3 కోట్లకుపైగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ 7 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











