Anaganaga Oka Raju Day 10 Collections: నవీన్ పొలిశెట్టి సరికొత్త చరిత్ర.. అనగనగా ఒక రాజుకు ఎన్ని కోట్ల లాభమంటే
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం అనగనగా ఒక రాజు. శ్రీకర స్టూడియోస్ వారు సమర్పిస్తున్నారు. మారి దర్శకత్వం వహించగా.. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ, సత్యశ్రీ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. మిక్కి జే మేయర్ సంగీత దర్శకత్వం వహించగా.. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటింగ్, చిన్మయి సంభాషణలు అందించారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14వ తేదీన అనగనగా ఒక రాజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 10వ రోజు అనగనగా ఒక రాజు మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే...
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి అనగనగా ఒకరాజు చిత్రానికి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో నవీన్ పొలిశెట్టి మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో అనగనగా ఒకరాజు సినిమాకు భారీగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

అనగనగా ఒక రాజు బ్రేక్‌ఈవెన్ టార్గెట్
అనగనగా ఒక రాజు నైజాం థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 2.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 28 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో నవీన్ పొలిశెట్టి సినిమా లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల రూపాయల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అనగనగా ఒక రాజు చిత్రాన్ని ఏపీ, తెలంగాణలలో 800 స్క్రీన్స్‌లో.. కర్ణాటక + తమిళనాడులో 300 స్క్రీన్స్‌లో, ఓవర్సీస్‌లో 800 స్క్రీన్స్ చొప్పున 1900 స్క్రీన్స్‌లో విడుదల చేశారు.
అనగనగా ఒక రాజు 9 రోజుల కలెక్షన్స్
నవీన్ పొలిశెట్టి మూవీకి తొలి రోజున ఇండియాలో 6.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 7 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.15 కోట్ల రూపాయలు, ఐదో రోజున 6.25 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.55 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.8 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 1.3 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 1.15 కోట్ల రూపాయలు చొప్పున 40.75 కోట్ల రూపాయల నెట్... 48 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా సాక్‌నిక్ నివేదించింది. అయితే అనగనగా ఒక రాజు చిత్రం ఐదు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 100.2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.
అనగనగా ఒక రాజు ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక భారత్‌తో సమానంగా ఓవర్సీస్‌లోనూ అనగనగా ఒకరాజు చిత్రం జైత్రయాత్ర సాగిస్తోంది. నార్త్ అమెరికాలో బుధవారం వరకు ఈ చిత్రం 1.61 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 15 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. గురువారం నవీన్ పొలిశెట్టి మూవీ 16K డాలర్లు (14.70 లక్షల రూపాయలు) వసూలు చేసింది. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో అనగనగా ఒక రాజు మూవీ 16 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉండొచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో నవీన్ పొలిశెట్టి మూవీకి 2.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో కలిపి ఓవర్సీస్‌లో ఈ మూవీకి 18.5 కోట్ల రూపాయలు వసూలైంది. ఓవర్సీస్ కలెక్షన్స్+ ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి అనగనగా ఒక రాజు మూవీకి వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 66.5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా సాక్‌నిక్ లెక్కలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో అనగనగా ఒక రాజు కలెక్షన్స్
నవీన్ పొలిశెట్టి మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 6.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 7 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.15 కోట్ల రూపాయలు, ఐదో రోజున 6.25 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.55 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.8 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 1.3 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 1.15 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది. కర్ణాటకలో 3.63 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 40.15 కోట్ల రూపాయలు, తమిళనాడులో 56 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 71 లక్షల రూపాయల చొప్పున ఇప్పటి వరకు 45.05 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది.
అనగనగా ఒక రాజు 10వ రోజు కలెక్షన్స్
విడుదలై దాదాపు 10 రోజులు కావొస్తున్నా తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్‌లలో ఈ సినిమా హౌస్‌ఫుల్‌గా సాగుతున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. వీకెండ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫస్ట్ షో, సెకండ్ షోలకు మంచి బుకింగ్స్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కడపటి వార్తలు అందేసరికి శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు అనగనగా ఒక రాజు మూవీకి ఇండియాలో 20 లక్షల రూపాయలు వసూలైంది. 10వ రోజు నవీన్ పొలిశెట్టి మూవీకి వరల్డ్ వైడ్‌గా 1.50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో సాక్‌నిక్ లెక్కల ప్రకారం ఈ సినిమా 10 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 68 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. నిర్మాతల లెక్కల ప్రకారం అనగనగా ఒక రాజు మూవీ 10 రోజుల వరకు 110 కోట్ల మార్క్ చేరుకోవచ్చని భావిస్తున్నారు.
నవీన్ పొలిశెట్టి అరుదైన చరిత్ర
ఈ సినిమా బ్రేక్‌ఈవెన్ కావాలంటే 30 కోట్ల రూపాయల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉండగా, సితార లెక్కల ప్రకారం దాదాపు 45 కోట్లకు పైగా లాభాల్ని అందించారు రాజుగారు. అనగనగా ఒక రాజు మూవీ విజయం సాధించడంతో నవీన్ పొలిశెట్టి మరో అరుదైన ఘనతను సాధించారు. వరుసగా నాలుగు బాక్సాఫీస్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (20 కోట్ల రూపాయలు), చిచ్చోరే (200 కోట్ల రూపాయలు), జాతిరత్నాలు (68 కోట్ల రూపాయలు) ఇప్పుడు తాజాగా అనగనగా ఒకరాజుతో తన ఖాతాలో సోలోగా 100 కోట్ల రూపాయల హిట్‌ను వేసుకున్నారు.


Click it and Unblock the Notifications











