Anaganaga Oka Raju Day 13 Collections: భారీ లాభాల్లో అనగనగా ఒక రాజు.. నవీన్ పొలిశెట్టి మూవీకి ఎన్ని కోట్లంటే?

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా మారి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అనగనగా ఒక రాజు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ వారు సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ, సత్యశ్రీ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. మిక్కి జే మేయర్ సంగీత దర్శకత్వం వహించగా.. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటింగ్, చిన్మయి సంభాషణలు అందించారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14వ తేదీన అనగనగా ఒక రాజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 13వ రోజు అనగనగా ఒక రాజు మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే...

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి అనగనగా ఒకరాజు చిత్రానికి 8 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో నవీన్ పొలిశెట్టి మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో అనగనగా ఒకరాజు సినిమాకు భారీగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

Anaganaga Oka Raju Day 13 Expected Box Office Collections Worldwide Naveen Polishetty s film Emerges As Most Profitable Indian Film

అనగనగా ఒక రాజు బ్రేక్‌ఈవెన్ టార్గెట్
అనగనగా ఒక రాజు నైజాం థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 2.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 28 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో నవీన్ పొలిశెట్టి సినిమా లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల రూపాయల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అనగనగా ఒక రాజు చిత్రాన్ని ఏపీ, తెలంగాణలలో 800 స్క్రీన్స్‌లో.. కర్ణాటక + తమిళనాడులో 300 స్క్రీన్స్‌లో, ఓవర్సీస్‌లో 800 స్క్రీన్స్‌ చొప్పున 1900 స్క్రీన్స్‌లో విడుదల చేశారు.

అనగనగా ఒక రాజు 12 రోజుల కలెక్షన్స్
నవీన్ పొలిశెట్టి మూవీకి తొలి రోజున ఇండియాలో 6.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 7 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.15 కోట్ల రూపాయలు, ఐదో రోజున 6.25 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.55 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.8 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 1.3 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 1.15 కోట్ల రూపాయలు, పదో రోజున 1.10 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 1.8 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు 46.05 కోట్ల రూపాయల నెట్... 54.3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా సాక్‌నిక్ తెలిపింది. అయితే అనగనగా ఒక రాజు చిత్రం ఐదు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 100.2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

అనగనగా ఒక రాజు ఓవర్సీస్ కలెక్షన్స్
రెండు వారాలు కావొస్తున్నా అనగనగా ఒకరాజు మూవీ ఓవర్సీస్‌లోనూ మంచి వసూలు రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 1.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 15.57 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో కలిపి ఈ సినిమాకు ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. సాక్‌నిక్ లెక్కల ప్రకారం ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి అనగనగా ఒక రాజు మూవీకి వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 74.3 కోట్ల రూపాయలు వసూలైంది.

తెలుగు రాష్ట్రాల్లో అనగనగా ఒక రాజు కలెక్షన్స్
నవీన్ పొలిశెట్టి మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 6.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 7 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.15 కోట్ల రూపాయలు, ఐదో రోజున 6.25 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.55 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.8 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 1.3 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 1.15 కోట్ల రూపాయలు, పదో రోజున 1.1 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 1.8 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు కర్ణాటకలో 4.25 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 46.30 కోట్ల రూపాయలు, తమిళనాడులో 70 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 85 లక్షల రూపాయల చొప్పున ఇప్పటి వరకు 54.03 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది.

అనగనగా ఒక రాజు 13వ రోజు కలెక్షన్స్
సంక్రాంతి సెలవులు, లాంగ్ వీకెండ్ కారణంగా అనగనగా ఒక రాజు మూవీకి యూత్ నుంచి మంచి ఆదరణ లభించింది. సోమవారం రిపబ్లిక్ డే సెలవు కారణంగా 13 రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ నిలకడగానే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 26వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు నవీన్ పొలిశెట్టి మూవీకి 19 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఫస్టో షో, సెకండ్ షోలకు కూడా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందని అంటున్నారు. కడపటి వార్తలు అందేసరికి 13వ రోజున ఇప్పటి వరకు అనగనగా ఒక రాజు మూవీకి 86 లక్షల రూపాయలు వసూలైనట్లు సాక్‌నిక్ చెప్పింది. సోమవారం ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 1.50 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో సాక్‌నిక్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 76 కోట్ల రూపాయలు రాబడుతుందని భావిస్తున్నారు.

అనగనగా ఒకరాజు మూవీ అరుదైన రికార్డ్?
రెండు వారాలు గడుస్తున్నా అదే ఊపుతో దూసుకెళ్తున్న అనగనగా ఒకరాజు మూవీ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా నిర్మాతలకు ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయల షేర్ అందించింది. పెట్టుబడి పోగా దాదాపు 40 కోట్ల రూపాయల లాభాలతో అనగనగా ఒకరాజు మూవీ ఈ ఏడాది భారత్‌లో మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం బడ్జెట్ మీద దాదాపు 470 శాతం మేర ఈ మూవీ లాభాలను అందించిందని టాక్. టోటల్ థియేట్రికల్ రన్‌ను బట్టి ఈ సినిమా ఎంతమేరకు లాభాలను అందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X