Anaganaga Oka Raju Day 2 Collections: అనగనగా ఒక రాజు వసూళ్ల జోరు... నవీన్ పొలిశెట్టి మూవీకి 2వ రోజు ఎంతంటే?

మారి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ వారు సమర్పిస్తున్నారు. రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ, సత్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీత దర్శకత్వం వహించారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటర్‌గా, చిన్మయి సంభాషణలు అందించారు. సంక్రాంతి పండుగ కానుకగా అనగనగా ఒక రాజు జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా రెండో రోజు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి అనగనగా ఒకరాజు చిత్రానికి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో నవీన్ పొలిశెట్టి మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో అనగనగా ఒకరాజు సినిమాకు భారీగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

Anaganaga Oka Raju Day 2 Expected Box Office Collections Worldwide Naveen Polishetty s film records excellent occupancy

అనగనగా ఒక రాజు నైజాం థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 2.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 28 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో నవీన్ పొలిశెట్టి సినిమా లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల రూపాయల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అనగనగా ఒక రాజు చిత్రాన్ని ఏపీ, తెలంగాణలలో 800 స్క్రీన్స్‌లో.. కర్ణాటక + తమిళనాడులో 300 స్క్రీన్స్‌లో, ఓవర్సీస్‌లో 800 స్క్రీన్స్‌ చొప్పున 1900 స్క్రీన్స్‌లో విడుదల చేశారు.

అనగనగా ఒక రాజు తొలి రోజు కలెక్షన్స్
నవీన్ పొలిశెట్టి మూవీకి తొలి రోజున ఇండియాలో 5.5 కోట్ల రూపాయల నెట్... 6.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి తదితర స్టార్ హీరోల సినిమాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ అనగనగా ఒక రాజు చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం.

ఓవర్సీస్‌లోన నవీన్ పొలిశెట్టి మూవీకి అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రీమియర్స్‌ + అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ఏకంగా 313k డాలర్లు (భారత కరెన్సీలో 2.82 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. తొలి రోజున 180k డాలర్లు (1.62 కోట్ల రూపాయలు) దాంతో నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ + ఫస్ట్ డే కలెక్షన్స్‌లో 5 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో రాజుగారు వసూళ్ల సునామీ సృష్టించారు. ఇక యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో అనగనగా ఒక రాజు చిత్రానికి మరో 3 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఓవర్సీస్ నుంచి నవీన్ పొలిశెట్టి మూవీకి తొలిరోజున 10 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తొలిరోజున అనగనగ ఒక రాజు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

అనగనగా ఒక రాజు 2వ రోజు కలెక్షన్స్
ఓ స్టార్ హీరో రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టిన నవీన్ పొలిశెట్టి భారీ వసూళ్లపై కన్నేసినట్లుగా కనిపిస్తోంది. పండక్కి గట్టి పోటీ ఉన్నప్పటికీ పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో అనగనగ ఒక రాజు చిత్రం రెండో రోజు మంచి బుకింగ్స్ నమోదు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రెండో రోజు సాయంత్రం 5 గంటల వరకు నవీన్ పొలిశెట్టి మూవీకి దాదాపు 60 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. కడపటి వార్తలు అందేసరికి ఇప్పటి వరకు ఇండియాలో అనగనగా ఒక రాజు మూవీకి 2.95 కోట్ల రూపాయల నెట్ వసూలైంది.

ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి నవీన్ పొలిశెట్టి మూవీకి రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 7 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు చొప్పున 12 నుంచి 15 కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో అనగనగా ఒక రాజు చిత్రం రెండ్రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X