Anaganaga Oka Raju Day 3 Collections: 50 కోట్ల అనగనగా ఒకరాజు.. నవీన్ పొలిశెట్టి సరికొత్త చరిత్ర

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరిలు హీరో హీరోయిన్లు. శ్రీకర స్టూడియోస్ వారు సమర్పిస్తున్నారు. మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ, సత్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీత దర్శకత్వం వహించారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటింగ్, చిన్మయి సంభాషణలు అందించారు. సంక్రాంతి పండుగ కానుకగా అనగనగా ఒక రాజు జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా మూడో రోజు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి అనగనగా ఒకరాజు చిత్రానికి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో నవీన్ పొలిశెట్టి మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో అనగనగా ఒకరాజు సినిమాకు భారీగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

Anaganaga Oka Raju Day 3 Expected Box Office Collections Worldwide Naveen Polishetty s film heading towards 50 crores mark

అనగనగా ఒక రాజు నైజాం థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 2.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 28 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో నవీన్ పొలిశెట్టి సినిమా లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల రూపాయల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అనగనగా ఒక రాజు చిత్రాన్ని ఏపీ, తెలంగాణలలో 800 స్క్రీన్స్‌లో.. కర్ణాటక + తమిళనాడులో 300 స్క్రీన్స్‌లో, ఓవర్సీస్‌లో 800 స్క్రీన్స్‌ చొప్పున 1900 స్క్రీన్స్‌లో విడుదల చేశారు.

అనగనగా ఒక రాజు 2 రోజుల కలెక్షన్స్
నవీన్ పొలిశెట్టి మూవీకి తొలి రోజున ఇండియాలో 6.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.4 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో రెండ్రోజుల్లో ఇండియాలో ఈ సినిమాకు 13.55 కోట్ల రూపాయల నెట్... 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే అనగనగా ఒక రాజు చిత్రం రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 41.2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 2.01 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 68 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో 90 లక్షల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 48 లక్షల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 31 లక్షల రూపాయలు, గుంటూరులో 36 లక్షల రూపాయలు, కృష్ణాలో 33 లక్షల రూపాయలు, నెల్లూరులో 20 లక్షల చొప్పున షేర్ రాబట్టింది. ఇప్పటి వరకు నవీన్ పొలిశెట్టి మూవీ కర్ణాటకలో 1.52 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల రూపాయలు, తమిళనాడులో 25 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 23 లక్షల రూపాయలు వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

ఇక ఓవర్సీస్‌లో అనగనగా ఒకరాజు చిత్రం జైత్రయాత్ర సాగిస్తోంది. రెండో రోజు నవీన్ పొలిశెట్టి మూవీ నార్త్ అమెరికాలో 122K డాలర్లు (భారత కరెన్సీలో 1.10 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక మూడో రోజు నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌లో 80K డాలర్లు (భారత కరెన్సీలో 72.66 లక్షల రూపాయలు) చూసింది. నార్త్ అమెరికాతో పాటు ఇతర దేశాలలో కలిపి మొత్తంగా రెండ్రోజుల వరకు ఓవర్సీస్‌లో నవీన్ పొలిశెట్టి మూవీ 7.50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ వెల్లడించింది.

అనగనగా ఒక రాజు 3వ రోజు కలెక్షన్స్
బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉన్నప్పటికీ అనగనగా ఒక రాజు చిత్రం బుకింగ్‌లో దుమ్మురేపుతోంది. మూడో రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ చిత్రానికి 34 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 328 షోలు, బెంగళూరులో 178 షోలు, విశాఖలో 102 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లు సాక్‌నిక్ నివేదించింది. కడపటి వార్తలు అందేసరికి అనగనగా ఒకరాజు చిత్రం మూడో రోజు ఇండియాలో 2.52 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది.

మూడో రోజు నవీన్ పొలిశెట్టి మూవీ తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో కోటి 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో అనగనగా ఒకరాజు చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల మార్క్ చేరుకుంటుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X