Anaganaga Oka Raju Day 5 Collections:100 కోట్లకు చేరువగా అనగనగా ఒకరాజు..నవీన్ పొలిశెట్టి మూవీకి 5వ రోజు ఎంతంటే

ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు వంటి భారీ చిత్రాల నడుమ సంక్రాంతికి విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రం రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. నవీన్ పొలిశెట్టి నటన, మీనాక్షి చౌదరి అందాలతో పాటు మారి టేకింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా అనగనగా ఒక రాజు మూవీ మరో ఘనతను సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా ఐదో రోజు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా అనగనగా ఒక రాజు చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ వారు సమర్పిస్తున్నారు. రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ, సత్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిక్కి జే మేయర్ సంగీత దర్శకత్వం వహించగా.. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటింగ్, చిన్మయి సంభాషణలు అందించారు. సంక్రాంతి పండుగ కానుకగా అనగనగా ఒక రాజు జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Anaganaga Oka Raju Day 5 Expected Box Office Collections Worldwide Naveen Polishetty s film heading towards 100 crores mark

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి అనగనగా ఒకరాజు చిత్రానికి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో నవీన్ పొలిశెట్టి మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో అనగనగా ఒకరాజు సినిమాకు భారీగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

అనగనగా ఒక రాజు బ్రేక్‌ఈవెన్ టార్గెట్
అనగనగా ఒక రాజు నైజాం థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 2.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 28 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో నవీన్ పొలిశెట్టి సినిమా లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల రూపాయల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అనగనగా ఒక రాజు చిత్రాన్ని ఏపీ, తెలంగాణలలో 800 స్క్రీన్స్‌లో.. కర్ణాటక + తమిళనాడులో 300 స్క్రీన్స్‌లో, ఓవర్సీస్‌లో 800 స్క్రీన్స్‌ చొప్పున 1900 స్క్రీన్స్‌లో విడుదల చేశారు.

అనగనగా ఒక రాజు 4 రోజుల కలెక్షన్స్
నవీన్ పొలిశెట్టి మూవీకి తొలి రోజున ఇండియాలో 6.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 7 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.15 కోట్ల రూపాయలు చొప్పున 27.7 కోట్ల రూపాయల నెట్... 32.65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా సాక్‌నిక్ నివేదించింది. అయితే అనగనగా ఒక రాజు చిత్రం నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 82 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

అనగనగా ఒక రాజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్
నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 7.46 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 2.44 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 3.86 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2.33 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 1.42 కోట్ల రూపాయలు, గుంటూరులో 1.59 కోట్ల రూపాయలు, కృష్ణాలో 1.30 కోట్ల రూపాయలు, నెల్లూరులో 85 లక్షల చొప్పున షేర్ రాబట్టింది. ఇప్పటి వరకు నవీన్ పొలిశెట్టి మూవీ కర్ణాటకలో 2.7 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 29 కోట్ల రూపాయలు, తమిళనాడులో 45 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.

అనగనగా ఒక రాజు ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక ఓవర్సీస్‌లో అనగనగా ఒకరాజు చిత్రం జైత్రయాత్ర సాగిస్తోంది. నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 9 కోట్ల రూపాయలు) మార్క్ చేరుకుని నవీన్ పొలిశెట్టి అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం నాటి షోలకు గాను అనగనగా ఒక రాజు చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపుతోంది. 495 షోలకు గాను నార్త్ అమెరికాలో 120K డాలర్లు (1.09 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఇక యూరప్, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో కలిపి నవీన్ పొలిశెట్టి మూవీకి మరో 3 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఓవర్సీస్‌లో అనగనగా ఒక రాజు చిత్రం 12 కోట్లకు పైగా వసూలు చేసింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి నవీన్ పొలిశెట్టి మూవీ నాలుగు రోజుల్లో 44.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది.

అనగనగా ఒక రాజు 5వ రోజు కలెక్షన్స్
ఆదివారం కావడంతో అనగనగా ఒకరాజు మూవీకి ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. 5వ రోజు సాయంత్రం 4 గంటల వరకు నవీన్ పొలిశెట్టి మూవీకి ఇండియాలో 35 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. మన శంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి వంటి చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ రాజు గారు తన హవా సాగిస్తున్నారు. కడపటి వార్తలు అందేసరికి అనగనగా ఒక రాజు మూవీకి ఇండియాలో 5వ రోజు 30.07 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. ఆదివారం నవీన్ పొలిశెట్టి మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 1.50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా సాక్‌నిక్ లెక్కల ప్రకారం 5 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 55 కోట్ల రూపాయలు మార్క్ చేరుకుంటుందని చెబుతున్నారు.

అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్
అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లెక్కల ప్రకారం అనగనగా ఒక రాజు మూవీ 4 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే అన్ని ఏరియాలలోనూ బ్రేక్‌ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పంచుతోంది. ఈ సినిమా బ్రేక్‌ఈవెన్ కావాలంటే 30 కోట్ల రూపాయల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉండగా, సితార లెక్కల ప్రకారం దాదాపు 22 కోట్లకు పైగా లాభాల్ని అందించారు రాజుగారు. ఈ వీకెండ్‌తో అనగనగా ఒకరాజు చిత్రం 100 కోట్ల రూపాయల మార్క్ చేరుకుంటుందని నవీన్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తద్వారా 100 కోట్ల రూపాయల క్లబ్‌లో అడుగుపెట్టిన హీరోగా నవీన్ అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నారు. ఆదివారంతో సంక్రాంతి సెలవులు అయిపోతుండటం, రేపటి నుంచి వర్కింగ్ డేస్ మొదలు కానుండటంతో రాజుగారి హవా ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X