Anaganaga Oka Raju Day 6 Box Office: అనగనగా ఒక రాజు వసూళ్ల జోరు.. నవీన్ పొలిశెట్టి మూవీ అరుదైన రికార్డు!

టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం అనగనగా ఒక రాజు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి తొలి చిత్ర దర్శకుడిగా మారి పరిచయమయ్యారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రంలో రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటర్‌గా, చిన్మయి సంభాషణలు అందించారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం జనవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా గత ఆరు రోజులుగా భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్లు పనిచేశారు. చిత్ర యూనిట్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్‌ సుమారుగా 40 కోట్ల రూపాయలు మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా నైజాం హక్కులు 7 కోట్ల రూపాయలు, ఆంధ్రా హక్కులు 10 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 2.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Anaganaga Oka Raju Day 6 Expected Box Office

ఇక ఈ చిత్రం గత ఐదు రోజుల్లో నైజాంలో 9 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 3 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.75 కోట్ల రూపాయలు, గుంటూరులో 2 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 1.5 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1 కోటి రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 5.5 కోట్ల రూపాయలు నెట్, రెండో రోజు 5 కోట్ల రూపాయలు, మూడో రోజు 5.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 5.5 కోట్లు, ఐదో రోజు 4.5 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా గత 5 రోజుల్లో ఆంధ్రా, నైజాం, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల నెట్, 45 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు కన్నడ, ఇతర రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 40 కోట్ల రూపాయల నెట్, 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు సాధించింది. అమెరికాలో ఈ సినిమా 1 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. అంటే ఈ సినిమా సుమారుగా 9.5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది. కెనడా, యూకే, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ దేశాల కలెక్షన్లు సమాచారం అందాల్సి ఉంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది అని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X