Baby 11 Days Collections: బేబి కలెక్షన్ల బీభత్సం.. లాభాలతో సంచలనం.. నిర్మాతకు జాక్ పాట్
ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా బేబి (Baby). లవ్ అండ్ ఎమోషనల్ గా వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఫుల్ పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి. అలా జూలై 14న విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగా వసూలు అవుతున్నాయి. ఇప్పటికే 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 66.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలో బేబి సినిమాకు 13వ రోజున వసూళ్లు ఎలా ఉన్నాయనే లెక్కలు గమనిస్తే..
నటీనటులు:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా బేబి. ఎస్కేఎన్ నిర్మాతగా సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాగబాబు, వైవా హర్ష, సాత్విక్ ఆనంద్, లిరిషా, ప్రభావతి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

బేబీ బిజినెస్:హైవే మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన బేబి సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే బిజినెస్ జరిగింది. నైజాంలో నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోటి, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ తో మొత్తంగా 7.40 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.
11వ రోజు:బేబి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. 11వ నైజాంలో రూ. 64 లక్షలు, సీడెడ్‌లో రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. రూ. 1.46 కోట్లు షేర్, రూ. 2.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

11 రోజుల్లో:బేబి చిత్రానికి ఏపీ, తెలంగాణలో 11 రోజుల్లో నైజాంలో రూ. 12.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.84 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.13 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.20 కోట్లు, గుంటూరులో రూ. 1.54 కోట్లు, కృష్ణాలో రూ. 1.66 కోట్లు, నెల్లూరులో రూ. 94 లక్షలతో కలిపి.. రూ. 29.31 కోట్లు షేర్, రూ. 5345 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

వరల్డ్ వైడ్ గా:తెలంగాణ, ఏపీలో బేబీ సినిమాకు 11 రోజుల్లో రూ. 29.31 కోట్లు షేర్‌ను రాబట్టిన బేబి సినిమా ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే కలెక్ట్ చేసింది. అలాగే కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో 11 రోజుల్లో రూ. 1.51 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.41 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 33.23 కోట్లు షేర్, రూ. 69.05 కోట్లు గ్రాస్ రాబట్టినట్లుగా తెలుస్తోంది.

లాభాలు:ట్రయాంగిల్ లవ్ కాన్సెప్టుతో వచ్చిన బేబి సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగ్గా.. రూ. 8.00 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇక ఈ సినిమాకు 11 రోజుల్లో రూ. 33.23 కోట్లు వచ్చాయి. అంటే రూ. 25.23 కోట్లు లాభాలు సొంతం చేసుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











