Baby 12 Days Collections: వర్షంలోనూ కలెక్షన్ల జోరు.. చిరంజీవి, విజయ్ దేవరకొండల రికార్డులు బ్రేక్
ఏ సినిమా ఫలితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఎంతో గ్రాండ్ గా, ప్రమోషన్సో విడుదలైన సినిమాలు కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడుతుంటాయి. అలాగే ఎలాంటి ఆర్బాటం లేకుండా వచ్చినా చిన్న చిత్రాలు కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటే బేబి (Baby Movie). విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ తాజా సినిమా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఫలితంగా కలెక్షన్లు భారీగా కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బేబే సినిమా 12వ రోజు కలెక్షన్స్ లెక్కల్లోకి వెళితే..
నటీనటులు:ఆనంద్ దేవరకొండతోపాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ లవ్ మూవీ 'బేబి'. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగబాబు, కిర్రాక్ సీత, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్:ప్రస్తుత కాలంలో లవ్ అనేది ఎలా ఉందనే కథాంశంతో వచ్చిన బేబి సినిమా ట్రైలర్, పాటలు, పోస్టర్లతో క్యూరియాసిటీ పెరిగింది. అందుకు తగినట్లుగానే ఈ సినిమా హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ చేసింది బేబి మూవీ.
12వ రోజు:బేబి చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 12వ నైజాంలో రూ. 54 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 19 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి మొత్తంగా రూ. 1.21 కోట్లు షేర్, రూ. 2.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అంటే 11వ రోజు కంటే 12వ రోజు కాస్తా తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో:బేబి మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో నైజాంలో రూ. 13.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.03 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.21 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, గుంటూరులో రూ. 1.60 కోట్లు, కృష్ణాలో రూ. 1.71 కోట్లు, నెల్లూరులో రూ. 97 లక్షలు వసూళైంది. మొత్తంగా చూస్తే రూ. 30.52 కోట్లు షేర్, రూ. 55.55 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బేబి చిత్రానికి 12 రోజుల్లో రూ. 30.52 కోట్లు షేర్‌ను రాబట్టింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే కలెక్ట్ చేసింది. ఇక కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో 12 రోజుల్లో రూ. 1.64 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.44 కోట్లు వసూలు చేసింది. ఇలా బేబి మూవీ 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 34.60 కోట్లు షేర్, రూ. 70 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లుగా తెలుస్తోంది.

రికార్డులు:బేబి సినిమా రూ. 8.00 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని 12 రోజుల్లో రూ. 26.60 కోట్ల లాభాలు సొంతం చేసుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూగా 12 రోజులు రూ. కోటికి తగ్గకుండా షేర్ అందుకుంది. ఈ రికార్డును సమం చేస్తూ బేబి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి టోటల్ కలెక్షన్స్ రూ. 51 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఎప్పుడో దాటేసింది.


Click it and Unblock the Notifications











