Baby 24 Days Collections: ఎక్కడా తగ్గని బేబి.. లాభాల సునామీ.. ఎన్ని కోట్లో తెలిస్తే!
చిన్న సినిమాగా విడుదలై కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టినవి ఎన్నో ఉన్నాయి. అలా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజా సినిమా బేబి (Baby Movie). ఆది నుంచి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలతో మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత అంతకుమించిన స్పందన తెచ్చుకుంది. రోజురోజుకి మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేస్తోంది. ఇతర సినిమాల పోటీని ఈజీగా ఎదుర్కొంటూ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో బేబి సినిమా 24వ రోజుల కలెక్షన్స్ (Baby Collection) ఎలా ఉన్నాయో చూస్తే..
నటీనటులు:ఆనంద్ దేవరకొండతోపాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ లవ్ మూవీ 'బేబి'. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగబాబు, కిర్రాక్ సీత, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్:ప్రస్తుత కాలంలో లవ్ అనేది ఎలా ఉందనే కథాంశంతో వచ్చిన బేబి సినిమా హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ చేసింది బేబి మూవీ.

24వ రోజు: బేబి చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 24వ నైజాంలో రూ. 25 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి మొత్తంగా రూ. 66 లక్షల షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

తెలుగు రాష్ట్రాల్లో: బేబి మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 24 రోజుల్లో నైజాంలో రూ. 15.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.63 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.86 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.60 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.53 కోట్లు, గుంటూరులో రూ. 2 కోట్లు, కృష్ణాలో రూ. 2.12 కోట్లు, నెల్లూరులో రూ. 1.18 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా చూస్తే రూ. 36.56 కోట్లు షేర్, రూ. 66.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బేబి చిత్రానికి 24 రోజుల్లో రూ. 36.56 కోట్లు షేర్‌ను రాబట్టింది. అలాగే కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో 24 రోజుల్లో రూ. 2.98 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.61 కోట్లు వసూలు చేసింది. ఇలా బేబి మూవీ 24 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.15 కోట్లు షేర్, రూ. 79.10 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లుగా తెలుస్తోంది.
బడ్జెట్-ప్రాఫిట్: బేబి సినిమా రూ. 8.00 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎప్పుడో పూర్తి కాగా.. రూ. 34.15 కోట్ల లాభంతో అతి భారీ త్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సుమారు రూ. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన బేబికి రూ. 79.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. అంటే అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన నిర్మాత SKNకు లాభాల సునామీ తీసుకొచ్చింది బేబి సినిమా


Click it and Unblock the Notifications











