Baby 4 Days Collections: బేబి కలెక్షన్ల సునామీ.. 4 రోజుల్లోనే అన్ని కోట్లు.. లాభాలు తెలిస్తే?
ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా బేబి (Baby). 2017లో అర్జున్ రెడ్డి, 2018 ఆర్ఎక్స్ 100 చిత్రాలు ఎలాగే 2023లో బేబి సినిమా అలాగా అని ప్రేక్షకులు ఫుల్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. జూలై 14న విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని లాభాల బాట పయనిస్తుంది. ఈ నేపథ్యంలో బేబి సినిమాకు 4వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
ట్రయాంగిల్ లవ్ స్టోరీ:ఆనంద్ దేవరకొండ, సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫేమ్ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రలు పోషించిన సినిమా బేబి. ఎస్కేఎన్ నిర్మాతగా సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాగబాబు, వైవా హర్ష, సాత్విక్ ఆనంద్, లిరిషా, ప్రభావతి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

బేబీ బిజినెస్:హైవే మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా బేబి. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో బేబిపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే బిజినెస్ అయింది. అలా నైజాంలో నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోటి, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ తో మొత్తంగా 7.40 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
4వ రోజు:బేబి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. 4వ నైజాంలో రూ. 1.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 58 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో కలిపి.. రూ. 3.72 కోట్లు షేర్, రూ. 6.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

4 రోజుల్లో:బేబి చిత్రానికి ఏపీ, తెలంగాణలో 4 రోజుల్లో నైజాంలో రూ. 5.63 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.13 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 కోటి, వెస్ట్ గోదావరిలో రూ. 58 లక్షలు, గుంటూరులో రూ. 71 లక్షలు, కృష్ణాలో రూ. 80 లక్షలు, నెల్లూరులో రూ. 47 లక్షలతో కలిపి.. రూ. 13.07 కోట్లు షేర్, రూ. 22.80 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
వరల్డ్ వైడ్ గా:తెలంగాణ, ఏపీలో బేబీ సినిమాకు 4 రోజుల్లో రూ. 13.07 కోట్లు షేర్‌ను రాబట్టిన బేబి సినిమా ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే కలెక్ట్ చేసింది. అలాగే కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో 4 రోజుల్లో రూ. 56 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.78 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ సినిమా 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.41 కోట్లు షేర్, రూ. 28.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

లాభాలు:ట్రయాంగిల్ లవ్ కాన్సెప్టుతో వచ్చిన బేబి సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగ్గా.. రూ. 8.00 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇక ఈ సినిమాకు 4 రోజుల్లో దీనికి రూ. 15.41 కోట్లు వచ్చాయి. అంటే రూ. 7.41 కోట్లు లాభాలు సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











