Baby 10 Days Collections: సండే పెను సంచలనం.. 10 రోజుల్లోనే రికార్డులు మటాష్.. నక్కతోక తొక్కిన SKN
సమాజంలో జరిగే వాస్తవిక పరిస్థితులను చూపించే సినిమాలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కుతూ ఉంటుంది. కానీ, ఇలాంటి చిత్రాలు పెద్దగా రూపొందడం లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చిన కాంటెంపరరీ లవ్ స్టోరీ మూవీనే 'బేబి'. హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆనంద్ దేవరకొండ నటించిన ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులు ఊహించని రీతిలో రెస్పాన్స్ ఇస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం నిర్మాతలపై కోట్ల వర్షం కురిపిస్తోంది. ఇక, రెండో ఆదివారం కూడా ఇది కుమ్మేసింది. మరి 'బేబి' మూవీ 10 రోజుల రిపోర్టును మీరే చూసేయండి!
శాడ్ లవ్ స్టోరీతో వచ్చిన 'బేబి':ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా విరాజ్ అశ్విన్ మరో ప్రధాన పాత్రలో నటించిన మూవీనే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ చేశాడు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:యూత్‌కు కనెక్ట్ అయ్యే కథాంశంతో వచ్చిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ చేసింది.
10వ రోజు తెలుగు వసూళ్లు ఇలా:'బేబి'కి ఏపీ, తెలంగాణలో 10వ రోజు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 53 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 54 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 16 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో కలిపి.. రూ. 3.40 కోట్లు షేర్, రూ. 6.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

10 రోజులకు కలిపి ఎంతొచ్చింది:10 రోజుల్లో 'బేబి' మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 12.06 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.08 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.63 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.03 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.13 కోట్లు, గుంటూరులో రూ. 1.45 కోట్లు, కృష్ణాలో రూ. 1.59 కోట్లు, నెల్లూరులో రూ. 88 లక్షలతో కలిపి.. రూ. 27.85 కోట్లు షేర్, రూ. 51.10 కోట్లు గ్రాస్ వసూలైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 27.85 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.48 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.38 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.71 కోట్లు షేర్, రూ. 66.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:క్లిష్టమైన ప్రేమకథతో వచ్చిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 31.71 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 23.71 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.

టాప్ మూవీగా రికార్డు నమోదు:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబి' మూవీ 10వ రోజు కూడా సంచలన రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 3.40 కోట్లు షేర్ రాబట్టింది. తద్వారా ఇంత మొత్తం రాబట్టిన మీడియం రేంజ్ చిత్రాల్లో టాప్ ప్లేస్‌కు చేరింది. ఓవరాల్‌గా 10వ రోజు కలెక్షన్లు చూస్తే ఇది 9వ స్థానానికి చేరుకుంది.


Click it and Unblock the Notifications











