Baby 15 Days Collections: బేబిని దెబ్బకొట్టిన బ్రో.. తొలిసారి ఇంత తక్కువగా.. టోటల్ చూస్తే మెంటలే
టాలీవుడ్‌లో అప్పుడప్పుడూ కొన్ని కల్ట్ మూవీలు వస్తుంటాయి. అందులో కొన్ని మాత్రం సంచలన వసూళ్లతో సత్తా చాటుతుంటాయి. అలా వచ్చిన సినిమాల్లో 'బేబి' ఒకటి. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీకి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ లభించింది.
ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను రాబట్టి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసుకుంది. ఇలా రెండు వారాలు కుమ్మేసింది. అయితే, 15వ రోజు మాత్రం ఈ చిత్రానికి 'బ్రో' మూవీ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఫలితంగా తొలిసారి కలెక్షన్లు భారీగా పడిపోయాయి. మరి 'బేబి' ఫుల్ రిపోర్టును మీరు కూడా చూడండి!

అలాంటి లవ్ స్టోరీతోనే 'బేబి': ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీనే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో విరాజ్ అశ్విన్ కీ రోల్ చేయగా.. నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీతలు నటించారు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే: కాంటెంపరరీ లవ్ స్టోరీతో వచ్చిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది.

15వ రోజు తెలుగు వసూళ్లు ఇలా: 'బేబి'కి ఏపీ, తెలంగాణలో 15వ రోజు రెస్పాన్స్ బాగా తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 19 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 47 లక్షలు షేర్, రూ. 85 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

15 రోజులకు కలిపి ఎంతొచ్చింది: 'బేబి' మూవీకి 15 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 14.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.93 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.40 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.34 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.35 కోట్లు, గుంటూరులో రూ. 1.73 కోట్లు, కృష్ణాలో రూ. 1.84 కోట్లు, నెల్లూరులో రూ. 1.04 కోట్లతో కలిపి.. రూ. 32.71 కోట్లు షేర్, రూ. 59.45 కోట్లు గ్రాస్ వసూలైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?: 15 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 32.71 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.52 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 15 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.13 కోట్లు షేర్, రూ. 75.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: క్రేజీ స్టోరీతో రూపొందిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లో దీనికి రూ. 37.13 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 29.13 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











