Baby 16 Days Collections: బ్రో ఉన్నా పెరిగిన వసూళ్లు.. 16 రోజుల్లో అన్ని కోట్లు.. 13 లక్షలు వస్తే!

చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చినా.. ఇప్పటి వరకూ ఒక్క విజయాన్ని కూడా ఖాతాలో వేసుకోలేకపోయాడు ఆనంద్ దేవరకొండ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో 'బేబి' అనే సినిమాలో నటించాడు. సరికొత్త లవ్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం అత్యధిక వసూళ్లను రాబడుతోంది. ఇక, పవన్ 'బ్రో' మూవీ ఉన్నా శనివారం ఈ సినిమా వసూళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో 'బేబి' 16 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరు కూడా చూడండి!

కాంటెంపరరీ స్టోరీతోనే 'బేబి'": ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రల్లో నటించిన కాంటెంపరరీ మూవీనే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీతలు నటించారు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు.

Baby

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:యూత్‌ఫుల్ కాన్సెప్టుతో రూపొందిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది.

16వ రోజు తెలుగు వసూళ్లు ఇలా: 'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 16వ రోజు రెస్పాన్స్ మళ్లీ పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 65 లక్షలు షేర్, రూ. 1.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Baby

16 రోజులకు కలిపి ఎంతొచ్చింది: 16 రోజుల్లో 'బేబి' మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 14.34 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.48 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.38 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.37 కోట్లు, గుంటూరులో రూ. 1.78 కోట్లు, కృష్ణాలో రూ. 1.89 కోట్లు, నెల్లూరులో రూ. 1.06 కోట్లతో కలిపి.. రూ. 33.36 కోట్లు షేర్, రూ. 60.60 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 16 రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 33.36 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.98 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.53 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 16 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.87 కోట్లు షేర్‌, రూ. 77.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Baby

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: కాంటెంపరరీ లవ్ స్టోరీతో వచ్చిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో దీనికి రూ. 37.87 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 29.87 కోట్లు లాభాలను అందుకుంది. మరో రూ. 13 లక్షలు వస్తే రూ. 30 కోట్ల లాభాలతో చరిత్ర సృష్టిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X