Baby 17 Days Collections: బేబి పెను సంచలనం.. పవన్ మూవీ ఉన్నా ఊచకోతే.. అన్ని కోట్ల లాభాలతో చరిత్ర
'బేబి.. బేబి.. బేబి..' కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హోరెత్తిపోతోన్న సినిమా పేర్లలో ఇది ఒకటి. అంతలా ఈ మూవీ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా నిర్మాతలకు కోట్లలో లాభాలను కూడా తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మూడో వారంలోనూ ఈ సినిమా అదిరిపోయే స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 17వ రోజైన ఆదివారం ఈ చిత్రం మరోసారి భారీ వసూళ్లను అందుకుంది. దీంతో ఓ సంచలన రికార్డు కూడా సొంతం అయింది. ఈ నేపథ్యంలో 'బేబి' 17 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!
సరికొత్త కాన్సెప్టుతో వచ్చిన బేబి:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్ స్టోరీ మూవీనే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీతలు నటించారు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూర్చాడు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:కాంటెంపరరీ లవ్ స్టోరీతో వచ్చిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ చేసుకుంది.
17వ రోజు తెలుగు వసూళ్లు ఇలా:ఆంధ్రా, తెలంగాణలో 'బేబి' మూవీకి 17వ రోజు రెస్పాన్స్ భారీగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 71 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

17 రోజులకు కలిపి ఎంతొచ్చింది:'బేబి' మూవీకి 17 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 14.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.56 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.43 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.41 కోట్లు, గుంటూరులో రూ. 1.84 కోట్లు, కృష్ణాలో రూ. 1.95 కోట్లు, నెల్లూరులో రూ. 1.09 కోట్లతో కలిపి.. రూ. 34.07 కోట్లు షేర్, రూ. 61.80 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:17 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 34.07 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.55 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 17 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 39.02 కోట్లు షేర్, రూ. 79.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లో దీనికి రూ. 39.02 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 31.02 కోట్లు లాభాలు వచ్చాయి. ఇలా ఇది రూ. 30 కోట్ల లాభాలతో చరిత్ర సృష్టించింది.


Click it and Unblock the Notifications











