Baby 19 Days Collections: షాకిచ్చే వసూళ్లు.. 19రోజుల్లోనే అన్ని కోట్లు.. ఇన్ని కోట్ల లాభం ఏంటి బాసూ!
ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. అందుకే అలా వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఈ కోవకు చెందిన సినిమానే 'బేబి'. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ కాంటెంపరరీ లవ్ స్టోరీతో రూపొందింది. దీంతో ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకుని గ్రాండ్‌గా విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే దీనికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఇలా మూడో వారంలోనూ ఈ చిత్రం సత్తా చాటుతోంది. మరి 'బేబి' 19 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!
యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో వచ్చింది:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ లవ్ స్టోరీ సినిమానే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీతలు నటించారు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్‌కు అందించాడు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:క్లిష్టమైన ప్రేమకథతో తెరకెక్కిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది.

19వ రోజు తెలుగు వసూళ్లు ఇలా:ఆంధ్రా, తెలంగాణలో 'బేబి' మూవీకి 19వ రోజు రెస్పాన్స్ మరింత తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 34 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

19 రోజులకు కలిపి ఎంతొచ్చింది:'బేబి' మూవీకి 19 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 14.94 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.34 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.65 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.48 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.43 కోట్లు, గుంటూరులో రూ. 1.90 కోట్లు, కృష్ణాలో రూ. 2.00 కోట్లు, నెల్లూరులో రూ. 1.11 కోట్లతో కలిపి.. రూ. 34.85 కోట్లు షేర్, రూ. 62.95 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 19 రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 34.85 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.58 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.57 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 19 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్లు షేర్, రూ. 84.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 19 రోజుల్లో దీనికి రూ. 40.00 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 32.00 కోట్లు లాభాలు వచ్చాయి. ఇక, ఈ చిత్రం రూ. 40 కోట్లు మార్కు చేరి రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











