Baby 1st Week Collections: 8 కోట్లే రావాలి.. కానీ వారంలో సంచలనంగా.. బేబి మూవీకి లాభం ఎంతో తెలిస్తే!

విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా.. సొంత ఐడెంటిటీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ క్రమంలోనే ఎన్నో విభిన్నమైన సినిమాలను చేస్తూ వచ్చాడు. కానీ, అతడికి విజయం మాత్రం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న కసితో 'బేబి' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ చిత్రం కలెక్షన్లు సునామీని సృష్టించింది. ఫలితంగా లాభాల పంట పడుతోంది. మరి 'బేబి' వారం రోజుల రిపోర్టును ఓసారి చూద్దామా!

యూత్‌కు కనెక్ట్ అయ్యేలా బేబి:ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రమే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా.. విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు.

Anand Deverakonda Baby Movie 1st Week Worldwide Official Collections

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'బేబి' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది.

7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 7వ రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 77 లక్షలు, సీడెడ్‌లో రూ. 37 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 11 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. రూ. 2.00 కోట్లు షేర్, రూ. 3.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Anand Deverakonda Baby Movie 1st Week Worldwide Official Collections

7 రోజులకు కలిపి ఎంతొచ్చింది:'బేబి' మూవీకి 7 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 8.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.99 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.60 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 86 లక్షలు, గుంటూరులో రూ. 1.09 కోట్లు, కృష్ణాలో రూ. 1.21 కోట్లు, నెల్లూరులో రూ. 69 లక్షలతో కలిపి.. రూ. 20.46 కోట్లు షేర్, రూ. 36.90 కోట్లు గ్రాస్ వసూలైంది.

Anand Deverakonda Baby Movie 1st Week Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వారం రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 20.46 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 92 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.15 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 7 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.53 కోట్లు షేర్‌, రూ. 44.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Anand Deverakonda Baby Movie 1st Week Worldwide Official Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:యూత్‌ఫుల్ స్టోరీతో రూపొందిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో దీనికి రూ. 23.53 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 15.53 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.

Anand Deverakonda Baby Movie 1st Week Worldwide Official Collections

వారంలోనే సంచలనంగా:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీగా నటించిన 'బేబి' మూవీ 7వ రోజు కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా రూ. 2 కోట్లు వరకూ వసూళ్లను సంపాదించింది. ఇక, వారం రోజుల్లోనే ఈ సినిమా రూ. 45 కోట్లు వరకూ గ్రాస్ మార్కును కూడా చేరుకుని సంచలనం సృష్టించింది. అలాగే, లాభాల పరంగానూ సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X