Baby 2 Weeks Collections: 8 కోట్లే రావాలి.. కానీ 2 వారాల్లో సంచలనంగా.. అన్ని కోట్ల లాభాలతో రికార్డు

యూత్‌ఫుల్ కాన్సెప్టుతో వచ్చే చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇది చాలా సినిమాల ఫలితాలతో నిరూపణ అయింది. అలా ఇటీవల వచ్చిన సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీనే 'బేబి'. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా కాంటెంపరరీ లవ్ స్టోరీతో రూపొందింది. దీంతో ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇలా రెండు వారాల్లో ఈ సినిమా సంచలన వసూళ్లు లభించాయి. ఈ నేపథ్యంలో 'బేబి' మూవీ 14 వారాల్లో ఎంత వసూళ్లు రాబట్టిందో చూడండి!

విభిన్నమైన కాన్సెప్టుతో 'బేబి':ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన మూవీనే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూర్చాడు.

Anand Deverakonda Baby Movie 2 Weeks Worldwide Official Collections

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:సంక్లిష్టమైన ప్రేమకథతో రూపొందిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది.

14వ రోజు తెలుగు వసూళ్లు ఇలా:'బేబి'కి ఏపీ, తెలంగాణలో 14వ రోజు కాస్త రెస్పాన్స్ తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 82 లక్షలు షేర్, రూ. 1.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Anand Deverakonda Baby Movie 2 Weeks Worldwide Official Collections

14 రోజులకు కలిపి ఎంతొచ్చింది:14 రోజుల్లో 'బేబి' మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 13.89 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.84 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.33 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.31 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.33 కోట్లు, గుంటూరులో రూ. 1.70 కోట్లు, కృష్ణాలో రూ. 1.81 కోట్లు, నెల్లూరులో రూ. 1.03 కోట్లతో కలిపి.. రూ. 32.24 కోట్లు షేర్, రూ. 58.60 కోట్లు గ్రాస్ వసూలైంది.

Anand Deverakonda Baby Movie 2 Weeks Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 14 రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 32.24 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.81 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 14 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.55 కోట్లు షేర్‌, రూ. 70.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Anand Deverakonda Baby Movie 2 Weeks Worldwide Official Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:యూత్‌ఫుల్ స్టోరీతో వచ్చిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లో దీనికి రూ. 36.55 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 28.55 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X