Baby 20 Days Collections: 20వ రోజూ దంచుడే.. చిన్న సినిమాకు అన్ని కోట్లా.. తెలుగులో మరో రికార్డు
సాధారణంగా ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే విజయం సాధిస్తాయి. అందులోనూ మరికొన్ని సినిమాలైతే సంచలనాలు సృష్టిస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన చిత్రమే 'బేబి'. నేటి యువత ప్రేమ విషయంలో చేస్తున్న పొరపాట్ల నేపథ్యంతో సాగే కథతో రూపొందిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది. ఫలితంగా దీనికి వసూళ్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇలా మూడో వారంలోనూ దంచేస్తుంది. ఈ నేపథ్యంలో 'బేబి' 20 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!
కాంటెంపరరీ లవ్ స్టోరీతో బేబి:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన కాంటెంపరరీ లవ్ స్టోరీ మూవీనే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీతలు నటించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూర్చాడు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:యూత్‌కు కనెక్ట్ అయ్యే కాన్సెప్టుతో వచ్చిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

20వ రోజు తెలుగు వసూళ్లు ఇలా:20వ రోజు ఆంధ్రా, తెలంగాణలో 'బేబి' మూవీకి రెస్పాన్స్ పర్వాలేదనిపించింది. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 30 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

20 రోజులకు కలిపి ఎంతొచ్చింది:'బేబి' మూవీకి 20 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 15.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.39 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.68 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.50 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.44 కోట్లు, గుంటూరులో రూ. 1.92 కోట్లు, కృష్ణాలో రూ. 2.02 కోట్లు, నెల్లూరులో రూ. 1.12 కోట్లతో కలిపి.. రూ. 35.15 కోట్లు షేర్, రూ. 63.55 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:20 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 35.15 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.58 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 20 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 40.38 కోట్లు షేర్, రూ. 85.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 20 రోజుల్లో దీనికి రూ. 40.38 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 32.38 కోట్లు లాభాలు వచ్చాయి. ఇక, తెలుగు రాష్ట్రాల్లో రూ. 35 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం మరో రికార్డును సాధించింది.


Click it and Unblock the Notifications











