Baby 22 Days Collections: 22వ రోజూ అన్ని లక్షలా.. మరో రికార్డుకు చేరువ.. SKN లాభం ఎంతో తెలిస్తే!

ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలుగా వచ్చిన కొన్ని చిత్రాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'బేబి' ఒకటి. నేటి యువత ప్రేమ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేస్తుంది అనే కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రం బిగ్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది.

అదే సమయంలో వసూళ్ల పరంగానూ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇలా మూడు వారాల్లో భారీ కలెక్షన్లను రాబట్టి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'బేబి' మూవీ 22 రోజుల రిపోర్టుపై మీరు కూడా లుక్కేయండి!

Anand Deverakonda Baby Movie 22 Days Worldwide Official Collections

'బేబి' అంటూ వచ్చిన టీమ్: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీతలు నటించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ క్రేజీ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు.

Anand Deverakonda Baby Movie 22 Days Worldwide Official Collections

బేబి మూవీ బిజినెస్ వివరాలివే: నేటి తరం ప్రేమ కథతో రూపొందిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్‌ జరిగింది.

Anand Deverakonda Baby Movie 22 Days Worldwide Official Collections

22వ రోజు తెలుగు వసూళ్లు ఇలా: 22వ రోజు 'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో రెస్పాన్స్ మరింత తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 18 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

Anand Deverakonda Baby Movie 22 Days Worldwide Official Collections

22 రోజులకు కలిపి ఎంతొచ్చింది: 'బేబి' మూవీకి 22 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 15.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.73 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.52 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.46 కోట్లు, గుంటూరులో రూ. 1.94 కోట్లు, కృష్ణాలో రూ. 2.05 కోట్లు, నెల్లూరులో రూ. 1.14 కోట్లతో కలిపి.. రూ. 35.57 కోట్లు షేర్, రూ. 64.40 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?: 22 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 35.57 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.60 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 22 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 40.97 కోట్లు షేర్‌, రూ. 86.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Anand Deverakonda Baby Movie 22 Days Worldwide Official Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 22 రోజుల్లో దీనికి రూ. 40.97 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 32.97 కోట్లు లాభాలు వచ్చాయి. మరో రూ. 3 లక్షలు వస్తే రూ. 33 కోట్లు లాభాలు వస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X