Baby 23 Days Collections: బేబికి ఊహించని రెస్పాన్స్.. 23 రోజుల్లో అన్ని కోట్లతో సంచలనం
టాలీవుడ్‌లో యూత్‌ఫుల్ లవ్ స్టోరీలతో వచ్చే చిత్రాలకు యువత నుంచి అదిరిపోయే స్పందన వస్తుంటుంది. అలా ఇప్పటి వరకూ ఎన్నో చిత్రాలు రాగా.. అందులో చాలా వరకూ విజయాన్ని అందుకున్నాయి.
ఈ క్రమంలోనే నేటి ప్రేమలకు సరైన అర్థం చెప్పే విధంగా రూపొందిన సినిమానే 'బేబి'. క్లిష్టమైన సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన వస్తోంది. ఇదే నాలుగో వారంలోనూ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా 23వ రోజు ఈ సినిమా చక్కని వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో 'బేబి' మూవీ 23 రోజుల రిపోర్టును మీరు కూడా చూసేయండి!

క్లిష్టమైన లవ్ స్టోరీతో 'బేబి': ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమానే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీతలు నటించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు. ఈ క్రేజీ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే: క్లిష్టమైన ప్రేమకథతో రూపొందిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

23వ రోజు తెలుగు వసూళ్లు ఇలా: 'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 23వ రోజు రెస్పాన్స్ భారీగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 13 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 33 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

23 రోజులకు కలిపి ఎంతొచ్చింది: 23 రోజుల్లో 'బేబి' మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 15.39 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.77 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.55 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.49 కోట్లు, గుంటూరులో రూ. 1.96 కోట్లు, కృష్ణాలో రూ. 2.07 కోట్లు, నెల్లూరులో రూ. 1.15 కోట్లతో కలిపి.. రూ. 35.90 కోట్లు షేర్, రూ. 65.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?: 23 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 35.90 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.87 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.60 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 23 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 41.37 కోట్లు షేర్, రూ. 88.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లో దీనికి రూ. 41.37 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 33.37 కోట్లు లాభాలు కూడా ఈ సినిమాకు సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











