Baby 25 Days Collections: బేబి ఊచకోత.. 25 రోజుల్లో సంచలన వసూళ్లు.. 57 లక్షలు వస్తే సరికొత్త చరిత్ర
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్ల గ్యాప్‌లో కల్ట్ క్లాసిక్ మూవీలు వస్తుంటాయి. అవే కలెక్షన్ల పరంగా, ప్రేక్షకుల ఆదరణ విషయంలోనూ సత్తా చాటుతోన్నాయి. ఇటీవలే విడుదలైన అలాంటి చిత్రమే 'బేబి'. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ కాంటెంపరరీ లవ్ స్టోరీతో రూపొందింది. దీంతో దీనికి అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లను వసూలు చేసుకుంటూ దూసుకుపోతోంది. అయితే, 24వ రోజు దుమ్ము దులపగా.. 25వ రోజు భారీగా డౌన్ అయింది. మరి 'బేబి' మూవీ ఇప్పటి వరకూ ఎంత రాబట్టిందో చూద్దామా!
లవ్ అండ్ మెసేజ్‌తో వచ్చింది:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీతలు నటించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు. ఈ లవ్ అండ్ మెసేజ్ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:కాంటెంపరరీ లవ్ స్టోరీతో వచ్చిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ అయింది.

25వ రోజు తెలుగు వసూళ్లు ఇలా:'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 25వ రోజు రెస్పాన్స్ భారీగా పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 23 లక్షలు షేర్, రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

25 రోజులకు కలిపి ఎంతొచ్చింది:'బేబి' మూవీకి 25 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 15.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.67 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.89 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.62 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.54 కోట్లు, గుంటూరులో రూ. 2.01 కోట్లు, కృష్ణాలో రూ. 2.14 కోట్లు, నెల్లూరులో రూ. 1.19 కోట్లతో కలిపి.. రూ. 36.79 కోట్లు షేర్, రూ. 66.52 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25 రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 36.79 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.03 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.61 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 25 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.43 కోట్లు షేర్, రూ. 89.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:యూత్‌ఫుల్ స్టోరీతో వచ్చిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 25 రోజుల్లో దీనికి రూ. 42.43 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 34.43 కోట్లు లాభాలు కూడా వచ్చాయి. అంటే మరో రూ. 57 లక్షలు వస్తే 35 కోట్ల లాభాల మార్కును చేరుతుంది.


Click it and Unblock the Notifications











