Baby 26 Days Collections: బేబికి ఊహించని వసూళ్లు.. 26 రోజుల్లోనే అన్ని కోట్లు.. మరో చరిత్రకు చేరువ
యువతకు కనెక్ట్ అయ్యే ఎలాంటి సినిమా అయినా సక్సెస్ అవుతుంది. ఇలా ఇప్పటికే టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు నిరూపించాయి. దీంతో అదే జోనర్‌లో సినిమాలు తీసేందుకు చాలా మంది ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన చిత్రమే 'బేబి'. కాంటెంపరరీ లవ్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన వస్తూనే ఉంది. దీంతో దీనికి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ముఖ్యంగా నాలుగో వారంలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'బేబి' మూవీ 26 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!
యూత్‌ఫుల్ కాన్సెప్టుతో వచ్చింది:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రను చేసిన సినిమానే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీతలు నటించారు. ఈ లవ్ అండ్ మెసేజ్ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:యువత మెచ్చే కథతో రూపొందిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.26 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

26వ రోజు తెలుగు వసూళ్లు ఇలా:'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 26వ రోజు రెస్పాన్స్ భారీగా పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 16 లక్షలు షేర్, రూ. 30 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

26 రోజులకు కలిపి ఎంతొచ్చింది:'బేబి' మూవీకి 26 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 15.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.69 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.91 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.55 కోట్లు, గుంటూరులో రూ. 2.02 కోట్లు, కృష్ణాలో రూ. 2.15 కోట్లు, నెల్లూరులో రూ. 1.20 కోట్లతో కలిపి.. రూ. 36.95 కోట్లు షేర్, రూ. 66.82 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:26 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 36.95 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.08 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.61 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 26 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.61 కోట్లు షేర్, రూ. 90.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 26 రోజుల్లో దీనికి రూ. 42.61 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 34.61 కోట్లు లాభాలు కూడా వచ్చాయి. అంటే మరో రూ. 39 లక్షలు వస్తే 35 కోట్ల లాభాల మార్కును చేరుతుంది.


Click it and Unblock the Notifications











