Baby 27 Days Collections: బ్రో కంటే ఎక్కువ వసూళ్లు.. 27 రోజుల్లో పెను సంచలనం.. ఆ రికార్డు కష్టమేనా!

విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోగా ఎన్నో సినిమాలు చేసినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు ఆనంద్ దేవరకొండ. ఈ పరిస్థితుల్లో ఇటీవలే 'బేబి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాంటెంపరరీ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన వచ్చింది.

దీంతో దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా నాలుగు వారాల్లోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా కుమ్మేసింది. ముఖ్యంగా 27వ రోజు ఇది 'బ్రో' మూవీ వసూళ్ల కంటే ఎక్కువే రాబట్టింది. ఈ నేపథ్యంలో 'బేబి' మూవీ 27 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!

 Anand Deverakonda Baby Movie 27 Days Worldwide Official Collections

బేబి అంటూ వచ్చిన చిన్న రౌడీ: ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రమే 'బేబి'. వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమాను సాయి రాజేష్ తీశాడు. ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీతలు నటించారు. ఈ లవ్ అండ్ మెసేజ్ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. దీనికి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఇచ్చాడు.

 Anand Deverakonda Baby Movie 27 Days Worldwide Official Collections

బేబి మూవీ బిజినెస్ వివరాలివే: యూత్‌కు కనెక్ట్ అయ్యే స్టోరీతో వచ్చిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.27 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్‌ అయింది.

 Anand Deverakonda Baby Movie 27 Days Worldwide Official Collections

27వ రోజు తెలుగు వసూళ్లు ఇలా: 'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 27వ రోజు రెస్పాన్స్ మరింత పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 14 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

 Anand Deverakonda Baby Movie 27 Days Worldwide Official Collections

27 రోజులకు కలిపి ఎంతొచ్చింది: 'బేబి' మూవీకి 27 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 15.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.93 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.64 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.56 కోట్లు, గుంటూరులో రూ. 2.03 కోట్లు, కృష్ణాలో రూ. 2.17 కోట్లు, నెల్లూరులో రూ. 1.21 కోట్లతో కలిపి.. రూ. 37.09 కోట్లు షేర్, రూ. 66.17 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?: 27 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 37.09 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.61 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 27 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.77 కోట్లు షేర్‌, రూ. 90.35 కోట్లు గ్రాస్ రాబట్టింది.

 Anand Deverakonda Baby Movie 27 Days Worldwide Official Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 27 రోజుల్లో దీనికి రూ. 42.77 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 34.77 కోట్లు లాభాలు కూడా వచ్చాయి. అంటే మరో రూ. 21 లక్షలు వస్తే 35 కోట్ల లాభాల మార్కును చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X