Baby 3 Weeks Collections: 8 కోట్లే టార్గెట్.. 3 వారాల్లో సంచలనం.. చిన్న మూవీకి అన్ని కోట్ల లాభాలా!
ప్రస్తుత పరిస్థితులకు తగ్గ సినిమాలు వస్తే వాటికి ఎలాంటి స్పందన వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ యూత్‌కు కనెక్ట్ అయ్యే కాంటెంపరరీ లవ్ స్టోరీలతో తెరకెక్కే మూవీలకు మరింత ఎక్కువ రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పుడు దీన్ని మరోసారి నిరూపిస్తూ సూపర్ సక్సెస్ అయిన సినిమానే 'బేబి'. సందేశాత్మక అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆరంభం నుంచీ అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. ఇలా మూడు వారాల్లోనూ ఇది కలెక్షన్ల సునామీని సృష్టించి ఎన్నో రికార్డులను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో 'బేబి' 21 రోజుల రిపోర్టు మీరే చూడండి!
'బేబి'తో కలిసి వచ్చిన ఆనంద్:ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన సినిమానే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీతలు నటించారు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూర్చాడు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో రూపొందిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ అయింది.

21వ రోజు తెలుగు వసూళ్లు ఇలా:ఆంధ్రా, తెలంగాణలో 21వ రోజు 'బేబి' మూవీకి రెస్పాన్స్ కాస్త తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 24 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

21 రోజులకు కలిపి ఎంతొచ్చింది:'బేబి' మూవీకి 3 వారాల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 15.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.43 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.71 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.51 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.45 కోట్లు, గుంటూరులో రూ. 1.93 కోట్లు, కృష్ణాలో రూ. 2.04 కోట్లు, నెల్లూరులో రూ. 1.13 కోట్లతో కలిపి.. రూ. 35.39 కోట్లు షేర్, రూ. 64.05 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:3 వారాల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 35.39 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.74 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.59 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 21 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 40.72 కోట్లు షేర్, రూ. 86.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 21 రోజుల్లో దీనికి రూ. 40.72 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 32.72 కోట్లు లాభాలు వచ్చాయి. ఫలితంగా ఈ చిత్రం సరికొత్త చరిత్రను సృష్టించింది.


Click it and Unblock the Notifications











