Baby 4 Weeks Collections: 8 కోట్లు బిజినెస్.. 4 వారాల్లో చరిత్ర సృష్టించింది.. లాభాలే అన్ని కోట్లు
యూత్‌ఫుల్ కంటెంట్‌తో వచ్చే సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఆదరణను అందిస్తూనే ఉన్నారు. గతంలో ఇలా వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన చిత్రమే 'బేబి'. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం కాంటెంపరరీ లవ్ స్టోరీతో వచ్చింది. దీనికి మొదటి రోజు నుంచే వసూళ్లు పోటెత్తుతున్నాయి. అలా ఇది నాలుగు వారాల్లో సంచలన కలెక్షన్లతో సత్తా చాటి లాభాల పంట పండించుకుంది. ఈ నేపథ్యంలో 'బేబి' మూవీ 4 వారాల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!
క్లిష్టమైన ప్రేమకథతో వచ్చింది:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'బేబి'. ఈ సినిమాను సాయి రాజేష్ తీశాడు. ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీతలు నటించారు. ఈ లవ్ అండ్ మెసేజ్ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. దీనికి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించాడు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో రూపొందిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.28 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగింది.
28వ రోజు తెలుగు వసూళ్లు ఇలా:'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 28వ రోజు రెస్పాన్స్ మరింత పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 3 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 10 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

28 రోజులకు కలిపి ఎంతొచ్చింది:'బేబి' మూవీకి 4 వారాల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 15.88 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.94 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.65 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.57 కోట్లు, గుంటూరులో రూ. 2.04 కోట్లు, కృష్ణాలో రూ. 2.18 కోట్లు, నెల్లూరులో రూ. 1.22 కోట్లతో కలిపి.. రూ. 37.19 కోట్లు షేర్, రూ. 66.37 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:4 వారాల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 37.19 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.11 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.62 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 28 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.89 కోట్లు షేర్, రూ. 90.75 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 28 రోజుల్లో దీనికి రూ. 42.89 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు రూ. 34.89 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











