Baby 5 Days Collections: బేబి విధ్వసం.. 5 రోజుల్లోనే ఊహకందని కలెక్షన్లు.. లాభాలతో సరికొత్త రికార్డు
టాలీవుడ్‌లో కాంటెంపరరీ లవ్ స్టోరీలతో వచ్చే చిత్రాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. గతంలో ఇలా వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమ కథా చిత్రమే 'బేబి'. చాలా కాలంగా హిట్ కోసం వేచి చూస్తున్న ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా 5వ రోజు కూడా ఈ చిత్రం భారీగానే రాణించింది. ఈ నేపథ్యంలో 'బేబి' మూవీ 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!
సెన్సేషనల్ కాన్సెప్టుతో 'బేబి':ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు చేసిన సినిమానే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన 'బేబి' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ అయింది.
5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5వ రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 46 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 52 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 16 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో కలిపి.. రూ. 2.94 కోట్లు షేర్, రూ. 5.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది:5 రోజుల్లో 'బేబి' మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 6.81 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.65 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.24 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 70 లక్షలు, గుంటూరులో రూ. 87 లక్షలు, కృష్ణాలో రూ. 97 లక్షలు, నెల్లూరులో రూ. 56 లక్షలతో కలిపి.. రూ. 16.01 కోట్లు షేర్, రూ. 28.15 కోట్లు గ్రాస్ వసూలైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐదు రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 16.01 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.00 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.71 కోట్లు షేర్, రూ. 38.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:ట్రాజెడీ లవ్ కాన్సెప్టుతో వచ్చిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 18.71 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.71 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.

వీక్ డేన కూడా ఈ రేంజ్‌లో:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన 'బేబి' మూవీ 5వ రోజైన వీక్ డేన కూడా ఊహించని వసూళ్లు సాధించింది. అలాగే, మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే రూ. 10 కోట్లకు పైగా లాభాలను అందుకుని చరిత్రను సృష్టించింది. ఇక, ఓవర్సీస్‌లో 450K డాలర్ల మార్కును కూడా దాటేసి రికార్డులు సాధించింది.


Click it and Unblock the Notifications











