Baby 6 Days Collections: బేబి కలెక్షన్ల తుఫాన్.. 6వ రోజూ సంచలనంగా.. అప్పుడే అన్ని కోట్లు ఏంటి సామీ!
హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతున్నా.. ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా ఖాతాలో వేసుకోలేకపోయాడు యంగ్ రౌడీ ఆనంద్ దేవరకొండ. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను అందుకోవాలన్న కసితో చేసిన సినిమానే 'బేబి'. కాంటెంపరరీ లవ్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రం ఆరంభంలోనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తద్వారా కలెక్షన్లు భారీ స్థాయిలో రాబడుతోంది. ఇదే ఊపును ఆరో రోజు కూడా కంటిన్యూ చేసింది. దీంతో అప్పుడే కొన్ని కోట్ల లాభాలనూ దక్కించుకుంది. ఇక, 'బేబి' మూవీ 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
కాంటెంపరరీ లవ్ స్టోరీతో బేబి:ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య జంటగా విరాజ్ అశ్విన్ కీలక పాత్ర చేసిన చిత్రమే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:ఆనంద్ దేవరకొండ నటించిన 'బేబి' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ చేసుకుంది.

6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 6వ రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 97 లక్షలు, సీడెడ్‌లో రూ. 41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 12 లక్షలు, కృష్ణాలో రూ. 13 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి.. రూ. 2.45 కోట్లు షేర్, రూ. 4.85 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

6 రోజులకు కలిపి ఎంతొచ్చింది:'బేబి' మూవీకి 6 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 7.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.62 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.10 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.44 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 79 లక్షలు, గుంటూరులో రూ. 99 లక్షలు, కృష్ణాలో రూ. 1.10 కోట్లు, నెల్లూరులో రూ. 63 లక్షలతో కలిపి.. రూ. 18.46 కోట్లు షేర్, రూ. 33.00 కోట్లు గ్రాస్ వసూలైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరు రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 18.46 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 83 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.12 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.41 కోట్లు షేర్, రూ. 40.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:కాంటెంపరరీ లవ్ స్టోరీతో రూపొందిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 21.41 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 13.41 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.

40 కోట్లతో సెన్సేషనల్ హిట్:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబి' మూవీ 6వ రోజు కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా రూ. 2 కోట్లకు పైగానే వసూళ్లను సంపాదించింది. ఇక, ఆరు రోజుల్లోనే ఈ సినిమా రూ. 40 కోట్లు గ్రాస్ మార్కును కూడా చేరుకుని సంచలనం సృష్టించింది. అలాగే, ఓవర్సీస్‌లో 'బేబి' మూవీ హాఫ్ మిలియన్ మార్కును కూడా చేరుకుంది.


Click it and Unblock the Notifications











