Baby 8 Days Collections: ఓర్నాయనో 8వ రోజూ కుమ్ముడే.. అన్ని కోట్లతో సెన్సేషన్.. టాప్ మూవీగా రికార్డు

మిగిలిన జోనర్లతో పోల్చుకుంటే యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా వస్తున్నాయి. అందుకే అలా వచ్చిన చిత్రాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పుడలా వచ్చి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్న చిత్రమే 'బేబి'.

ఇప్పటి వరకూ హిట్ కొట్టని ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే టార్గెట్ చేరుకుని లాభాల బాటలో పయనిస్తోంది. ఇలా రెండో వారంలోనూ అదిరిపోయే స్పందనను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో 'బేబి' మూవీ ఎనిమిది రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

Anand Deverakonda Baby Movie 8 Days Worldwide Official Collections

అలాంటి లవ్ స్టోరీతోనే బేబి: ఆనంద్ దేవరకొండ నటించిన కాంటెంపరరీ లవ్ మూవీనే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా.. విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు.

Anand Deverakonda Baby Movie 8 Days Worldwide Official Collections

బేబి మూవీ బిజినెస్ వివరాలివే: యూత్‌ఫుల్ కాన్సెప్టుతో వచ్చిన 'బేబి' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ చేసుకుంది.

Anand Deverakonda Baby Movie 8 Days Worldwide Official Collections

8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 8వ రోజూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 90 లక్షలు, సీడెడ్‌లో రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 1.76 కోట్లు షేర్, రూ. 3.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Anand Deverakonda Baby Movie 8 Days Worldwide Official Collections

8 రోజులకు కలిపి ఎంతొచ్చింది: 8 రోజుల్లో 'బేబి' మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 8.46 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.72 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.70 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 92 లక్షలు, గుంటూరులో రూ. 1.18 కోట్లు, కృష్ణాలో రూ. 1.30 కోట్లు, నెల్లూరులో రూ. 73 లక్షలతో కలిపి.. రూ. 22.22 కోట్లు షేర్, రూ. 37.15 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?: 8 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 22.22 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.23 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 8 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.50 కోట్లు షేర్‌, రూ. 54.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Anand Deverakonda Baby Movie 8 Days Worldwide Official Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: కాంటెంపరరీ లవ్‌తో వచ్చిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 25.50 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 17.50 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.

టాప్ మూవీగా గొప్ప రికార్డు: ఆనంద్ దేవరకొండ నటించిన 'బేబి' మూవీ 8వ రోజు కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. అంతేకాదు, ఈ చిత్రం అప్పుడే రూ. 54 కోట్లు గ్రాస్‌ను కూడా వసూలు చేసింది. తద్వారా వేగంగా రూ. 50 కోట్లు గ్రాస్ మార్కును చేరుకున్న మొట్టమొదటి మీడియం రేంజ్ మూవీగా రికార్డు సాధించింది. అలాగే, రూ. 25 కోట్లు షేర్ మార్కును చేరుకుని మరో ఘనతనూ అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X