Baby 9 Days Collections: మళ్లీ బేబి ఊచకోత.. అమ్మ బాబోయ్ అన్ని కోట్లా.. లాభం చూస్తే దిమ్మ తిరిగిద్ది!
టాలీవుడ్‌లోకి వచ్చి చాలా కాలం అయినా విజయాన్ని అందుకోవడానికి ఇబ్బందులు పడిన హీరోల్లో ఆనంద్ దేవరకొండ ఒకడు. తెరంగేట్రం చేసిన తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా అతడికి హిట్ మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న కసితో 'బేబి' అనే యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో వచ్చాడు.
దీనికి ప్రేక్షకుల నుంచి రికార్డు స్థాయి రెస్పాన్స్ వస్తోంది. దీంతో రెండో వారంలోనూ కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం మళ్లీ పుంజుకుంది. మరి 'బేబి' మూవీ ఎనిమిది రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

క్లిష్టమైన ప్రేమ కథతో వచ్చింది: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్లిష్టమైన లవ్ మూవీనే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు.

బేబి మూవీ బిజినెస్ వివరాలివే: నేటి పరిస్థితులకు తగ్గ కథతో వచ్చిన 'బేబి' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది.

9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 9వ రోజూ రికార్డు రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. రూ. 2.33 కోట్లు షేర్, రూ. 4.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది: 'బేబి' మూవీకి 9 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 10.44 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.55 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.09 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.86 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.01 కోట్లు, గుంటూరులో రూ. 1.29 కోట్లు, కృష్ణాలో రూ. 1.42 కోట్లు, నెల్లూరులో రూ. 79 లక్షలతో కలిపి.. రూ. 24.45 కోట్లు షేర్, రూ. 44.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?: 9 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 24.45 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.30 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 28.05 కోట్లు షేర్, రూ. 58.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: యూత్‌ఫుల్ స్టోరీతో వచ్చిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 28.05 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20.05 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.

20 కోట్లు లాభాలతో సెన్సేషన్: ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'బేబి' మూవీ 9వ రోజు కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం అప్పుడే రూ. 28.05 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా రూ. 20 కోట్లు లాభాల మార్కును చేరుకుని చరిత్రను సృష్టించింది. అలాగే, రూ. 58 కోట్లు గ్రాస్‌ను కూడా అందుకుంది. దీంతో ఈ సినిమా ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసుకుంది.


Click it and Unblock the Notifications











