Gam Gam Ganesha 2 Days Collections: ఆనంద్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎంత వచ్చిందో తెలిస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి పెద్ద బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకునేలా ముందుకు సాగుతోన్నాడు చిన్న రౌడీ ఆనంద్ దేవరకొండ. కెరీర్ ఆరంభం నుంచీ డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేసిన అతడు.. ఇప్పుడు మరో విజయాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో 'గంగం గణేశా' అనే మూవీని చేశాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అయితే, దీనికి ఆశించిన రీతిలో వసూళ్లు మాత్రం లభించడం లేదు. ఈ నేపథ్యంలో 'గంగం గణేశా' సినిమా 2 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
క్రైమ్ కామెడీతో వచ్చేశాడు
ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ మూవీనే 'గంగం గణేశా'. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని వంశీకృష్ణ కారుమంచి, కేదార్ సెలగం శెట్టి నిర్మించారు. ఇందులో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్లుగా చేయగా.. ఇమాన్యూయేల్, ప్రిన్స్ యావర్‌లు నటించారు. చైతన్ భరద్వాజ్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

ఆనంద్ సినిమా బిజినెస్
హీరోగా పరిచయం అయినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ.. ఈ మధ్యనే భారీ హిట్‌ను అందుకున్న ఆనంద్ దేవరకొండ 'గంగం గణేశా' మూవీపై అంచనాలను భారీగానే ఏర్పరచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను పెంచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 5.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.
2వ రోజు ఎంత వచ్చింది?
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గంగం గణేశా' మూవీకి టాక్ మంచిగా వచ్చినా రెస్పాన్స్‌ను ఆశించిన రీతిలో అందుకోలేదు. అయితే, రెండో రోజు ఈ సినిమా అదే హోల్టును కనబరుచుకుంది. ఫలితంగా ఈ సినిమాకు శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 40 లక్షలు షేర్ వసూలు అయింది. అలాగే, రూ. 85 లక్షలు గ్రాస్‌ను ఇది రాబట్టుకుంది.

2 రోజులకు కలిపి ఎంత?
ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గంగం గణేశా' సినిమాకు మిగిలిన వాటి నుంచి పోటీ ఉన్నప్పటికీ మంచి టాక్ రాబట్టుకోగలిగింది. దీంతో రెండు రోజుల్లో నైజాంలో రూ. 56 లక్షలు షేర్, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 68 లక్షలు షేర్‌ను వసూలు చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 1.24 కోట్లు షేర్, రూ. 2.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన 'గంగం గణేశా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 1.24 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 22 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి రెండు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 1.46 కోట్లు షేర్‌తో పాటు రూ. 3 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
'గంగం గణేశా' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లో ఆనంద్ దేవరకొండ సినిమాకు రూ. 1.46 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.04 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











