Gam Gam Ganesha 5 Days Collections: అన్ని కోట్లు దాటిన గంగం గణేశా.. హిట్ కావాలంటే ఎంత రావాలంటే!
విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఆరంభం నుంచీ విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తోన్న అతడు.. 'బేబి'తో బిగ్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మరో సక్సెస్‌ను అందుకోవాలన్న లక్ష్యంతో 'గంగం గణేశా' అనే మూవీని చేశాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అయితే, దీనికి ఆశించిన రీతిలో వసూళ్లు మాత్రం లభించడం లేదు. ఈ నేపథ్యంలో 'గంగం గణేశా' సినిమా 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
క్రైమ్ కామెడీ స్టోరీతో మూవీ:ఆనంద్ దేవరకొండ - ఉదయ్ శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన క్రైమ్ కామెడీ మూవీనే 'గంగం గణేశా'. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని వంశీకృష్ణ కారుమంచి, కేదార్ సెలగం శెట్టి నిర్మించారు. ఇందులో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్లుగా చేయగా.. ఇమాన్యూయేల్, ప్రిన్స్ యావర్‌లు నటించారు. చైతన్ భరద్వాజ్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.

ఆనంద్ సినిమా బిజినెస్:సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ.. ఈ మధ్యనే భారీ హిట్‌ను అందుకున్న ఆనంద్ దేవరకొండ 'గంగం గణేశా' మూవీపై అంచనాలను భారీగానే ఏర్పరచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను పెంచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 5.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.
5వ రోజు ఎంత వచ్చింది?:చిన్న రౌడీ ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గంగం గణేశా' మూవీకి టాక్ మంచిగా వచ్చినా రెస్పాన్స్‌ను ఆశించిన రీతిలో అందుకోలేదు. వీక్ డేస్‌లో ఈ చిత్రం మరింతగా డౌన్ అవుతూనే ఉంటోంది. ఫలితంగా ఈ సినిమాకు మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 15 లక్షలు షేర్ వసూలు అయింది. అలాగే, రూ. 30 లక్షలు గ్రాస్‌ను ఇది రాబట్టుకుంది.

5 రోజులకు కలిపి ఎంత?:ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన 'గంగం గణేశా' సినిమాకు మిగిలిన వాటి నుంచి పోటీ ఉన్నప్పటికీ మంచి టాక్ రాబట్టుకోగలిగింది. దీంతో ఐదు రోజుల్లో నైజాంలో రూ. 92 లక్షలు షేర్, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 1.08 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 2.00 కోట్లు షేర్, రూ. 4.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన 'గంగం గణేశా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 2.00 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 30 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి 5 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 2.30 కోట్లు షేర్‌తో పాటు రూ. 5 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:'గంగం గణేశా' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఐదు రోజుల్లో ఆనంద్ దేవరకొండ సినిమాకు రూ. 2.30 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 3.20 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











