Gam Gam Ganesha Business: 85 కోట్ల హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ.. గంగం గణేశాకు బిజినెస్ ఇంతేనా!

క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా.. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా సొంతం చేసుకోలేకపోయాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పటి వరకూ అతడు చేసిన మూవీలు సక్సెస్ కాకున్నా.. నటుడిగా మాత్రం మంచి పేరును తెచ్చుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే గత ఏడాది 'బేబి'తో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఆనంద్ దేవరకొండ 'గంగం గణేశా' అనే సినిమాను చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం ఎంత బిజినెస్ చేసుకుందో మీరే చూసేయండి!

Anand Deverakonda Starrer Gam Gam Ganesha Movie Pre Release Business Details

గంగం గణేశా అంటున్నాడు
ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'గంగం గణేశా'. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని వంశీకృష్ణ కారుమంచి, కేదార్ సెలగం శెట్టి నిర్మించారు. ఇందులో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్లుగా చేయగా.. ఇమాన్యూయేల్, ప్రిన్స్ యావర్‌లు నటించారు. చైతన్ భరద్వాజ్ దీనికి సంగీతాన్ని అందించాడు.

Anand Deverakonda Starrer Gam Gam Ganesha Movie Pre Release Business Details

ప్రమోషన్స్‌తో సందడిగానే

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'గంగం గణేశా' మూవీని మే 31వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఎప్పటి నుంచో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సందడి కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు రౌడీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే బుకింగ్స్ విషయంలో కూడా ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.

సినిమా ప్రీ బిజినెస్ ఇలా
ఆనంద్ దేవరకొండ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'గంగం గణేశా' మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో దీనికి అన్ని ఏరియాల్లో మంచి డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమా రూ. 4.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా 350 థియేటర్లలో విడుదల అయింది.

Anand Deverakonda Starrer Gam Gam Ganesha Movie Pre Release Business Details

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే

ఆనంద్ దేవరకొండ - ఉదయ్ శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన 'గంగం గణేశా' మూవీపై అందరిలో ఆసక్తి ఉంది. అందుకు తగ్గట్లే మార్కెట్ పరంగా ఇది బయ్యర్ల దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.00 కోట్లకు అమ్ముడైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 5.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.

Anand Deverakonda Starrer Gam Gam Ganesha Movie Pre Release Business Details

అన్ని కోట్లు వస్తేనే హిట్
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గంగం గణేశా' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 6.00 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే 'గంగం గణేశా' సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తుంది. 'బేబి' వంటి భారీ హిట్ వచ్చినా ఇంత తక్కువ బిజినెస్ కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X