Tantra Collections అనన్య నాగళ్ల మూవీకి షాకింగ్‌గా కలెక్షన్లు.. బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటంటే?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న యువ హీరోయిన్ అనన్య నాగళ్ల. ఆమె నటించిన తాజా చిత్రం తంత్ర. ఈ చిత్రంలో ధనుష్ రఘుముద్రి, టెంపర్ వంశీ, సలోని అశ్విని, మీసాల లక్ష్మణ్, మనోజ్ ముత్యం, కుషాలిని తదితరులు నటించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గొపిశెట్టి దర్శకత్వం వహించగా.. నరేష్ బాబు పీ, రవిచైతన్య నిర్మించారు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా మార్చి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తంత్ర సినిమా కథ విషయానికి వస్తే.. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఓ అమ్మాయి.. కాలేజీలో సరదాగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అయితే ఆమెను కంటికి కనిపించని అదృశ్య శక్తులు వెంటాడుతుంటాయి. దాంతో ఒంటరిగా బయటకు వెళ్లడానికి భయపడుతుంటుంది. తాంత్రిక శక్తులతో వేధింపులకు గురైన యువతి జీవితంలో ఏం జరిగిందనేది ఈ సినిమా కథ.

Ananya Nagalla s Tantra Movie Expected Box Office Collections In Telugu States

ఈ సినిమాను గ్రాఫిక్స్‌తోపాటు అత్యంత సాంకేతిక విలువలతో నిర్మించారు. అలాగే టాలెంటెడ్ యాక్టర్లతో సినిమాను చిత్రీకరించారు. అనన్య నాగళ్ల రెమ్యునరేషన్, ఇతర పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 4 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక సినిమాను సమారుగా 150 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేయడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 2 కోట్లుగా వ్యాల్యూ కట్టారు.

ఇలాంటి బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ చేపట్టిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా దాంతో కాస్త స్లోగా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ వారాంతంలో ఈ సినిమాకు ఆదరణ దక్కితే.. కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Ananya Nagalla s Tantra Movie Expected Box Office Collections In Telugu States

ఇదిలా ఉండగా.. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ అంచనాలకు దిగువనే కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా తొలి రోజు 35 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంకా ఈ సినిమా లాభాల్లోకి చేరాలంటే.. భారీగానే లక్ష్యం ముందుంది. అయితే రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద పుంజుకొని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X