Dream Girl 2 బాక్సాఫీస్ వద్ద అనన్య పాండే కలెక్షన్ల మ్యాజిక్.. భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న డ్రీమ్ గర్ల్ 2

బాలీవుడ్ యువ హీరో, హీరోయిన్లు ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే నటించిన చిత్రం డ్రీమ్ గర్ల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం నిలకడగా వసూళ్లను సాధిస్తూ 100 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్నది. ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. డ్రీమ్ గర్ల్ 2 మూవీ 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో పాపులర్ సినిమా డ్రీమ్ గర్ల్ టైటిల్‌తో వచ్చిన డ్రీమ్ గర్ల్ 2 చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్‌పై ప్రముఖ నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించారు. ఈ సినిమాకు రాజ్ శాండిల్య దర్శకత్వం వహించారు. పరేశ్ రావెల్, రాజ్ పాల్ యాదవ్, అన్ను కూపర్, విజయ్ రాజ్ తదితరులు నటించారు.

 Ananya Pandays Dream Girl 2 Day 6 expected Collections worldwide

డ్రీమ్ గర్ల్ 2 సినిమాను దాదాపు 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌కు భారీగా రెస్సాన్స్ రావడంతో మంచి ఓపెనింగ్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు అయ్యాయి. దాంతో ఈ సినిమాను ఇండియాలో 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే తొలి ఆట నుంచి మౌత్ టాక్ పెరగడంతో తొలి రోజు నుంచే కలెక్షన్లు ఊపందుకొన్నాయి.

డ్రీమ్ గర్ల్ 2 సినిమా కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..తొలి రోజు 10.7 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు అంతకు మించి 14 కోట్లు రాబట్టింది. మూడో రోజు ఆదివారం భారీగా అంటే 16 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లోనే 40 కోట్ల వసూళ్లు సాధించింది. సోమవారం, మంగళవారం కూడా నిలకడగా వసూళ్లు సాధించింది. 4వ రోజు ఈ చిత్రం 5.42 కోట్లు, 5వ రోజు 5.87 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 5 రోజుల్లో 53 కోట్ల రూపాయలు రాబట్టింది.

 Ananya Pandays Dream Girl 2 Day 6 expected Collections worldwide

ఇక డ్రీమ్ గర్ల్ చిత్రం 6వ రోజు కూడా భారీ కలెక్షన్లు సాధించే అవకాశం కనిపిస్తున్నది. ఈ చిత్రం బుధవారం 30 నుంచి 35 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 6వ రోజు 7 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాంతో ఈ చిత్రం ఇండియాలోనే 60 కోట్ల మేర వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

 Ananya Pandays Dream Girl 2 Day 6 expected Collections worldwide

డ్రీమ్ గర్ల్ 2 మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 60 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో భారీగానే కలెక్షన్లను రాబట్టింది. యూఎస్, ఇతర దేశాల్లో ఈ చిత్రం 7 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 67 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఇదే జోష్‌ను కొనసాగిస్తే 100 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X