Dream Girl 2 Collections 100 కోట్లకు ఎసరుపెట్టిన అనన్య పాండే.. లాభాల్లోకి రావాలంటే?
టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, అందాల తార అనన్య పాండే జంటగా నటించిన లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ డ్రీమ్ గర్ల్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. రిలీజ్‌కు చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలకు ప్రేక్షకులు కనెక్ట్ కావడంతో తొలి వారాంతం భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. గత మూడు రోజుల్లో డ్రీమ్ గర్ల్ 2 సినిమా సాధిస్తున్న కలెక్షన్లు, బడ్జెట్, బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే..
డ్రీమ్ గర్ల్ 2 మూవీని ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్, శోభాకపూర్ తమ సొంత బ్యానర్‌పై భారీగా, రిచ్‌గా నిర్మించారు. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుమారు 55 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడానికి సుమారు 10 కోట్ల రూపాయలను ప్రమోషన్స్ కోసం ఉపయోగించారు. దాంతో ఈ సినిమా ఖర్చు 65 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.

డ్రీమ్ గర్ల్ 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమా థ్రియేట్రికల్ బిజినెస్ 70 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 75 కోట్లుగా ట్రేడ్ వర్గాలు వ్యాల్యూ కట్టారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 75 కోట్లు రాబట్టాల్సిన పరిస్థితిలో దాదాపు 2500 స్క్రీన్లలో రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డ్రీమ్ గర్ల్ 2 (Dream Girl 2) మూవీ తొలి రోజున భారీగానే కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా తొలి రోజున ఇండియాలో 11 కోట్ల రూపాయలు, రెండో రోజు 14 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక మూడో రోజు ఈ చిత్రం తొలి రెండు రోజుల కంటే ఎక్కువగా వసూలు చేసింది. మూడో రోజున ఈ సినిమా 16 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 40 కోట్లకుపైగా షేర్, 48 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

డ్రీమ్ గర్ల్ 2 (Dream Girl 2) మూవీ ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా అమెరికా, ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 7 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా త్వరలోనే ఓవర్సీస్‌లో ఒక మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరేందుకు రెడీ అవుతున్నది. గత మూడు రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ 2 (Dream Girl 2) కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో 48 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 55 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యానికి చేరాలంటే.. కనీసం ఇంకా 30 కోట్లు వసూలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











