Dream Girl 2 సైలెంట్‌గా 100 కోట్లు కొట్టేసిన అనన్య పాండే.. డ్రీమ్ గర్ల్ 2 సినిమాకు ఎన్ని కోట్ల లాభమంటే?

బాలీవుడ్ యువ తారలు ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే నటించిన డ్రీమ్ గర్ల్ 2 చిత్రం ట్రేడ్ పండితుల అంచనాలు తలకిందులు చేసింది. హిందీ చిత్ర సీమలో చిన్న చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ప్రేమ కథా చిత్రంగా భావోద్వేగాలు ప్రధాన అంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రం గత మూడు వారాలుగా బాక్సాఫీస్‌ను కలెక్షన్లతో బేజారెత్తించింది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్, సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

డ్రీమ్ గర్ల్ 2 సినిమా విషయానికి వస్తే.. పరేశ్ రావెల్, అన్నూ కపూర్, విజయ్ రాజ్ తదితరులతో ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్, శోభాకపూర్ ఈ మూవీని రూపొందించారు. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ సినిమా బడ్జెట్ వస్తే. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ యాక్టివిటీతో కలిపి 70 కోట్ల రూపాయలు వ్యయం అయింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 75 కోట్లుగా నిర్ణయించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Ananya Panday

డ్రీమ్ గర్ల్ 2 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మొదటి రోజు తొలి ఆట నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్‌తోపాటు హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. మొదటి రోజు 10 కోట్ల భారీ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జైత్రయాత్రను ప్రారంభించిన ఈ సినిమా రెండో రోజు 14 కోట్లు, మూడో రోజు 16 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తొలివారం ఈ సినిమా మొత్తంగా 57 కోట్ల రూపాయలను రాబట్టింది.

డ్రీమ్ గర్ల్ 2చిత్రం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ రెండోవారంలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద గదర్ 2 సినిమా పోటీని కూడా తట్టుకొని రెండోవారం ఓ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. రెండోవారం ఈ సినిమా దాదాపు 29 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలివారం 86 కోట్ల రూపాయలు రాబట్టింది.

డ్రీమ్ గర్ల్ 2 మూవీ మూడో వారం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా జవాన్, గదర్ సినిమాల తాకిడిని ఎదుర్కొంటూ.. 15వ రోజున 90 లక్షలు, 16వ రోజున 1.35 కోట్లు, 17వ రోజున 1.5 కోట్లు, 18వ రోజున 60 లక్షలు, 19వ రోజున 50 లక్షలు, 20వ రోజున 45 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలోనే 100 కోట్ల మార్కును దాటింది.

Ananya Panday

డ్రీమ్ గర్ల్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ సినిమా 100 కోట్ల షేర్, 118 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 14 కోట్ల రూపాయలు రాడట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 132 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 75 కోట్ల బ్రేక్ ఈవెన్‌ లక్ష్యంగా సాగిన బాక్సాఫీస్ యాత్ర.. ఈ సినిమాకు 35 కోట్ల రూపాయల లాభాలను థియేట్రికల్‌గా రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X