30 Rojullo 3 Days Collections: ప్రదీప్ సినిమా నుంచి ఇది ఊహించరు.. కేవలం మూడు రోజుల్లోనే ఫినీష్!

అద్భుతమైన టైమింగ్‌, ఆకట్టుకునే హోస్టింగ్‌తో దాదాపు పదేళ్లుగా తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ మేల్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. తనదైన శైలి యాంకరింగ్‌తో సత్తా చాటుతోన్న అతడు.. వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడీ యంగ్ యాంకర్. ఎన్నో అంచనాల నడుమ విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. కానీ, కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ప్రదీప్ సినిమా నుంచి ఊహించని న్యూస్ వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

బుల్లితెరపై రారాజు.. హీరోగా పరిచయం

బుల్లితెరపై రారాజు.. హీరోగా పరిచయం

బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా పేరు దక్కించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. అద్భుతమైన హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న అతడు.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మున్నా అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

రికార్డులు బద్దలు.. అన్నీ కలిసొచ్చాయి

రికార్డులు బద్దలు.. అన్నీ కలిసొచ్చాయి

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' కరోనా సహా ఎన్నో ఆటంకాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ గ్యాప్‌లో రిలీజ్ అయిన 'నీలి నీలి ఆకాశం' అనే పాట రికార్డులు క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో బడా నిర్మాణ సంస్థలు గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ దీన్ని రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ కారణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.

నెగెటివ్ టాక్.. యంగ్ హీరోకు ప్రశంసలు

నెగెటివ్ టాక్.. యంగ్ హీరోకు ప్రశంసలు

ఎన్నో అంచనాల నడుమ ప్రదీప్ నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మిశ్రమ స్పందనే వచ్చింది. ఫస్టాఫ్ కొంత సాగదీతగా ఉందని, సెకెండాఫ్ ఎమోషనల్‌గా సాగిందని చెబుతున్నారు. మొత్తంగా ఓ సారి చూసే సినిమానే అంటున్నారు. ఇక, ప్రదీప్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

ప్రీ బిజినెస్ అలా... రెండు రోజులకే సగం

ప్రీ బిజినెస్ అలా... రెండు రోజులకే సగం

యాంకర్ ప్రదీప్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'కు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 4.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు రూ. 1.69 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. రెండో రోజు రూ. 96 లక్షలు వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో ఈ మూవీ రూ. 2.65 కోట్లు షేర్, రూ. 4.33 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంటే రెండు రోజుల్లోనే సగం టార్గెట్‌ను రీచ్ అయింది.

ప్రదీప్ సినిమా నుంచి ఇది ఊహించరు

ప్రదీప్ సినిమా నుంచి ఇది ఊహించరు

ఆదివారం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో నైజాంలోనే రూ. 48 లక్షలు, సీడెడ్ రూ. 36 లక్షలు, గుంటూరు రూ. 11 లక్షలు, కృష్ణా రూ. 14 లక్షలు, గోదావరి జిల్లాల్లో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 21 లక్షలు వసూలు చేసింది. ఫలితంగా మూడో రోజు రూ. 1.57 కోట్ల షేర్, రూ. 2.60 కోట్ల గ్రాస్ రాబట్టింది.

Recommended Video

30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్
కేవలం మూడు రోజుల్లోనే టార్గెట్ ఫినీష్

కేవలం మూడు రోజుల్లోనే టార్గెట్ ఫినీష్

ప్రదీప్ నటించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 4.22 కోట్లు షేర్, రూ. 7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఫలితంగా బ్రేక్ ఈవెన్‌ (రూ. 4.80 కోట్లు)కు చేరువ అయింది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ నైజాం ఏరియాతో పాటు గుంటూరు, తూర్పు గోదావరి ఏరియాలో మూడు రోజుల్లోనే టార్గెట్ ఫినీష్ చేసేసింది. మరికొన్ని ప్రాంతాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్‌ను పూర్తి చేస దిశగా దూసుకుపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X