For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    30 Rojullo Preminchadam Ela Collections: ఊహించని విధంగా ప్రదీప్ మూవీ కలెక్షన్స్.. షాకిస్తోన్న లెక్కలు

    |

    తెలుగు బుల్లితెరపై చాలా ఏళ్లుగా తిరుగులేని యాంకర్‌గా వెలుగొందుతోన్నాడు ప్రదీప్ మాచిరాజు. ఏమాత్రం అంచనాలు లేకుండానే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని టాప్ యాంకర్‌గా ఎదిగిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, మొదటి రోజు కలెక్షన్లు మాత్రం ఊహించని విధంగా వచ్చాయి. దీంతో సినీ పెద్దలే షాకైపోతున్నారు. ఆ సంగతులు మీకోసం!

    రేడియో జాకీ నుంచి టాప్ యాంకర్ వరకు

    రేడియో జాకీ నుంచి టాప్ యాంకర్ వరకు

    రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించి.. జీ తెలుగులో ప్రసారం అయిన సెలెబ్రిటీ గేమ్ షో ద్వారా యాంకర్‌గా పరిచయం అయ్యాడు ప్రదీప్ మాచిరాజు. ఆ వెంటనే ‘గడసరి అత్త సొగసరి కోడలు' అనే షోతో బ్రేక్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ షోకు ఉత్తమ యాంకర్‌గా నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు.

    బుల్లితెర నుంచి వెండితెర వరకు ప్రయాణం

    బుల్లితెర నుంచి వెండితెర వరకు ప్రయాణం

    తనదైన శైలి హోస్టింగ్‌తో ఎన్నో షోలను విజయవంతంగా నడిపించాడు యాంకర్ ప్రదీప్‌. అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకుంటూ చాలా షోలను వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడు. అదే సమయంలో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు. అందులో పవన్ ‘అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ ‘జులాయి', నాగ చైతన్య ‘100% లవ్', ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా' పేరు తెచ్చాయి.

    30 రోజుల్లోతో హీరోగా పరిచయమయ్యాడు

    30 రోజుల్లోతో హీరోగా పరిచయమయ్యాడు

    ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు యాంకర్ ప్రదీప్. మున్నా అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. ‘నీలి నీలి ఆకాశం' అనే పాటతో రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేసిన ప్రదీప్.. సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక, ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

    రిలీజ్‌కు ముందే రికార్డు... భారీగా బిజినెస్

    రిలీజ్‌కు ముందే రికార్డు... భారీగా బిజినెస్

    ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' కరోనా సహా ఎన్నో ఆటంకాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ గ్యాప్‌లో రిలీజ్ అయిన ‘నీలి నీలి ఆకాశం' అనే పాట రికార్డులు క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో బడా నిర్మాణ సంస్థలు గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ దీన్ని రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ కారణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.

    సినిమాకు మిశ్రమ స్పందన.. ప్రదీప్‌ మాత్రం

    సినిమాకు మిశ్రమ స్పందన.. ప్రదీప్‌ మాత్రం

    ఎన్నో అంచనాల నడుమ ప్రదీప్ నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మిశ్రమ స్పందనే వచ్చింది. ఫస్టాఫ్ కొంత సాగదీతగా ఉందని, సెకెండాఫ్ ఎమోషనల్‌గా సాగిందని చెబుతున్నారు. మొత్తంగా ఓ సారి చూసే సినిమానే అంటున్నారు. ఇక, ప్రదీప్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

    ఊహించని విధంగా ప్రదీప్ మూవీ కలెక్షన్స్

    ఊహించని విధంగా ప్రదీప్ మూవీ కలెక్షన్స్

    ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా'కు మొదటి రోజు ఊహించని విధంగా రూ. కోటికి పైగానే షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాంతాల వారిగా చూసుకుంటే నైజాంలోనే రూ. 40 లక్షలు, సీడెడ్ రూ. 40 లక్షలు, గుంటూరు రూ. 20 లక్షలు, గోదావరి జిల్లాల్లో రూ. 20 లక్షలు వరకూ కలెక్ట్ చేసినట్లు సమాచారం. టాక్ బాగోకున్నా ఈ లెక్కలు చూసి సినీ పెద్దలే షాక్ అవుతున్నారు.

    English summary
    Pradeep Machiraju is an Indian Telugu television presenter and actor. He won State Nandi award as Best Anchor in 2014 for the show Gadasari Atta Sogasari Kodalu. Pradeep was born in Amalapuram, East Godavari district of Andhra Pradesh, India and brought up in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X