Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
30 Rojullo Day 2 Collections: ప్రదీప్ దెబ్బకు రికార్డులు బద్దలు.. రెండ్రోజుల్లోనే సగం.. ఇంకెంత రావాలంటే!
దాదాపు పదేళ్లుగా తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. లేడీ యాంకర్ల హవా కనిపిస్తోన్న తరుణంలోనూ వరుసగా ఆఫర్లు అందుకోవడంతో పాటు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ సత్తా చాటుతున్నాడు. టెలివిజన్ రంగంలో తనదైన ముద్రను వేసుకున్న ఈ కుర్రాడు.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లను అందుకుంటోంది. మొదటి రోజు దుమ్ముదులిపిన ప్రదీప్ మూవీ.. రెండో రోజు ఎంత వసూలు చేసిందో చూడండి!
టాప్ యాంకర్.. హీరోగా మొదలుపెట్టాడు
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు యాంకర్ ప్రదీప్. మున్నా అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. 'నీలి నీలి ఆకాశం' అనే పాటతో రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేసిన ప్రదీప్.. సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక, ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.
పాటతో మారింది.. రికార్డులు బద్దలేసింది
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' కరోనా సహా ఎన్నో ఆటంకాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ గ్యాప్‌లో రిలీజ్ అయిన 'నీలి నీలి ఆకాశం' అనే పాట రికార్డులు క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో బడా నిర్మాణ సంస్థలు గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ దీన్ని రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ కారణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.
ఎన్నో అంచనాలు.. టాక్ మాత్రం షాకింగ్‌గా
ఎన్నో అంచనాల నడుమ ప్రదీప్ నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మిశ్రమ స్పందనే వచ్చింది. ఫస్టాఫ్ కొంత సాగదీతగా ఉందని, సెకెండాఫ్ ఎమోషనల్‌గా సాగిందని చెబుతున్నారు. మొత్తంగా ఓ సారి చూసే సినిమానే అంటున్నారు. ఇక, ప్రదీప్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
మొదటి రోజు అనుకున్న దాని కంటే ఎక్కువే
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా'కు మొదటి రోజు ఊహించని విధంగా రూ. 1.69 కోట్లు షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ప్రాంతాల వారిగా చూసుకుంటే నైజాంలోనే రూ. 61 లక్షలు, సీడెడ్ రూ. 24 లక్షలు, గుంటూరు రూ. 19.1 లక్షలు, కృష్ణా రూ. 10 లక్షలు, గోదావరి జిల్లాల్లో రూ. 26.5 లక్షలు, నెల్లూరు రూ. 8 లక్షలు, ఓవర్సీస్లో రూ. 17 లక్షలు కలెక్ట్ చేసి సత్తా చాటిందీ మూవీ.
రెండో రోజు కూడా జోరు చూపించిన మూవీ
మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. రెండో రోజు కూడా ప్రదీప్ సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'కు రూ. 96 లక్షలు వసూలు చేసింది. ప్రాంతాల వారిగా చూసుకుంటే నైజాంలోనే రూ. 33 లక్షలు, సీడెడ్ రూ. 17 లక్షలు, గుంటూరు రూ. 8 లక్షలు, కృష్ణా రూ. 6.4 లక్షలు, గోదావరి జిల్లాల్లో రూ. 15 లక్షలు, నెల్లూరు రూ. 5.6 లక్షలు, ఓవర్సీస్లో రూ. 11 లక్షలు వసూలు చేసింది.
Recommended Video
రెండు రోజులకు కలిపి ఎంత? టార్గెట్ ఎంత?
ప్రదీప్ ఉన్న క్రేజ్ నేపథ్యంలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'కు రూ. 4.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక రెండు రోజుల్లో ఈ మూవీ రూ. 2.65 కోట్లు షేర్, రూ. 4.33 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంటే రెండు రోజుల్లోనే సగం టార్గెట్‌ను రీచ్ అయింది. ఇంకో రూ. 2.15 కోట్లు సాధిస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ను అందుకుంటుంది. ఇప్పుడున్న జోరు చూస్తే మరో రెండు రోజుల్లోనే ఇది పూర్తయ్యేలా ఉంది.