Jayamma Panchayathi Pre Release bussiness: సుమ సినిమా బిజినెస్ ఎంత.. రావాల్సింది ఎంత?
తెలుగు ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అని అంటే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు యాంకర్ సుమ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలోనే కాకుండా ఒకప్పుడు ఆమె వెండితెరపై కూడా కనిపించే ప్రయత్నం చేశారు. మళ్లీ చాలా కాలం తర్వాత సినిమాలో ఒక లీడ్ రోల్ లో కనిపిస్తూ సక్సెస్ అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆమె నటించిన జయమ్మ పంచాయతీ నేడు విడుదలైంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఏ స్థాయిలో జరిగింది? అలాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తం ఎంత రాబడితే సక్సెస్ అయినట్లు లెక్క? అనే వివరాల్లోకి వెళితే..
Recommended Video


ఆ సినిమాలతో
యాంకర్ సుమ మొదట టెలివిజన్ రంగంలో నటిస్తూనే మరోవైపు కొన్ని సినిమాల్లో ఒక ప్రత్యేకమైన పాత్రలో కూడా కనిపించింది. ఆమె మొదట కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత పవిత్ర బంధం సినిమాలో అలాగే వర్షం సినిమాలో ప్రభాస్ సోదరి గా నటించింది. ఆ తర్వాత బాద్షా, రావోయి చందమామ, స్వరాభిషేకం సినిమాలలో కూడా అతిథి పాత్రలో కనిపించి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

సుమ కోసం స్టార్ హీరోలు
ఇక మళ్ళీ చాలాకాలం తర్వాత యాంకర్ సుమ టెలివిజన్ రంగంలో బిజీగా ఉండగా జయమ్మ పంచాయతీ అనే సినిమాతో వెండితెర ప్రేక్షకులను పలకరిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో మొదటి నుంచి కూడా ఆమె చాలా విభిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం కొంతమంది అగ్రహీరోలు కూడా ఆమెకు సపోర్ట్ చేశారు. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఆమె నాని నాగార్జున వంటి హీరోలను ప్రత్యేక అతిథిగా పిలిపించిన విషయం తెలిసిందే.

పవన్, మహేష్ కూడా..
ఇక మహేష్ బాబు కూడా సుమ కోసం ప్రత్యేకంగా జయమ్మ పంచాయతీ ట్రైలర్ ను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రమోషన్ ఈవెంట్ లో జయమ్మ పంచాయతీకి ప్రత్యేకంగా విషెస్ ను కూడా అందించడం జరిగింది. అగ్రహీరోలు కూడా ఆమె సినిమాకు మద్దతు పలకడంతో మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది.

విలేజ్ డ్రామాగా..
ఇక శుక్రవారం రోజు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. బలగ ప్రకాష్ నిర్మించిన ఈ విలేజ్ డ్రామాకి కీరవాణి సంగీతం అందించారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డిఫరెంట్ విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. మొదటి నుంచి సినిమాకు ఓ వర్గం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఫైనల్ గా సినిమాను నేడు ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చారు.

ఏపీ తెలంగాణ బిజినెస్
జయమ్మ పంచాయతీ బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. నైజాంలో 1.5 కోట్లు సీడెడ్ లో 50 లక్షలు, ఉత్తరాంధ్రలో 60 లక్షలు, వెస్ట్ లో 12 లక్షలు, గుంటూరులో 18 లక్షలు, కృష్ణా లో 15 లక్షలు, నెల్లూరులో 10 లక్షలు. ఇలా మొత్తంగా ఏపీ తెలంగాణలో ఈ సినిమా 3.25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో ఈ సినిమా చాలా తక్కువ బిజినెస్ చేసింది. ఆ రూట్లో మొత్తంగా 20 లక్షల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఫైనల్ గా జయమ్మ పంచాయతీ ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ 3.45 కోట్లు అని సమాచారం.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ఇక థియేట్రికల్ గా ఈ సినిమా 3.45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా బాక్సాఫీస్ వద్ద 3.5 బ్రేక్ ఈవెన్ టార్గెట్ సెట్ అయింది. కేవలం సుమ రేంజ్ కు తగ్గట్టుగా మార్కెట్లో అయితే సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. బడ్జెట్ కు తగ్గట్టుగా ఈ సినిమా పర్వాలేదు అనే విధంగా బిజినెస్ చేసింది. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను సినిమా ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుంది అలాగే మొదటి రోజు ఎంత వసూలు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











