అదరగొడుతున్న అందాల రాముడు
కమేడియన్ సునీల్ హీరోగా, అందాల తార ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా ఇటీవల విడుదలై అందాల రాముడు చిత్రం అన్ని ప్రాంతాలలోనూ మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రాన్ని మొదట 60 ప్రింట్లతో విడుదల చేశారు. అయితే, మొదటి షో నుంచి టాక్ బాగా రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ ప్రింట్స్ కోసం డిమాండ్ చేస్తున్నారు. సునీల్ కామెడీ, పంచ్ డైలాగులూ, అందాల భామ ఆర్తీ అగర్వాల్ నటన, చిత్రంలో క్లయిమాక్స్, ఇంకా పాటలూ అన్నీ ఈ చిత్రానికి హైలెట్స్‌గా నిలుస్తున్నాయి.
మంచి చిత్రాల రూపకర్తలు మెగాసూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై లక్ష్మీనారాయణ (దీప్తి) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత ఆర్.బి. చౌదరి సమర్పించారు. ఎస్.వి. ప్రసాద్, పరాస్ జైన్ భాగస్వామ్య నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం విజయం గురించి పరాస్ జైన్ మాట్లాడుతూ తాము అనుకున్న దానికన్నా అందాల రాముడు విజయం సాధిస్తోందని, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం విజయానికి పూర్తి క్రెడిట్ యూనిట్ సభ్యులదేనని, ముఖ్యంగా సునీల్, ఆర్తీ ఆగర్వాల్ ఎంతో సహకరించారని పరాస్ జైన్ అన్నారు.


Click it and Unblock the Notifications