twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    6 రోజుల్లో రూ. 106 కోట్లు.. బాక్సాఫీసు వద్ద చిన్న సినిమా సంచలనం!

    |

    బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక చిన్న సినిమా చైనా బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. కేవలం 6 రోజుల్లో రూ. 106 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. అంతే కాదు ఇండియాలో వసూలైన లైఫ్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ సినిమా మరేదో కాదు ఆయుష్మాన్ ఖురానా నటించిన 'అంధాధున్'.

    శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గతేడాది అక్టోబర్ 5న ఇండియాలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా ఈ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేయగా అక్కడ కూడా ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.

    వసూళ్లపై తరణ్ ఆదర్శ్ ట్వీట్

    వసూళ్లపై తరణ్ ఆదర్శ్ ట్వీట్

    ''అంధాధున్ చైనా వసూళ్లపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. ‘అంధాధున్ చిత్రం చైనాలో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. సోమవారం 1.45 మిలియన్ డాలర్ రాబట్టి వసూళ్లు స్ట్రాంగ్‌గా ఉన్నాయి. 6 రోజుల్లో మొత్తం 15.25 మిలియన్ డాలర్లు(రూ. 106.09 కోట్లు) వసూలు చేసింది'' అని ట్వీట్ చేశారు.

    మర్డర్ మిస్టరీ చుట్టూ

    మర్డర్ మిస్టరీ చుట్టూ

    అంధాధున్ చిత్రంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే, అనిల్ ధావన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఒక హత్యోదంతం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. సినిమా ఆసక్తికర కథనంతో భారతీయ ప్రేక్షకుల మెప్పించింది. చైనాలో కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర బృందం సంతోషంగా ఉంది.

    పియానో ప్లేయర్

    పియానో ప్లేయర్

    వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, మ్యాచ్ బాక్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ‘అంధాధున్' చిత్రాన్ని చైనాలో ‘పియానో ప్లేయర్' పేరుతో విడుదల చేశారు. గతంలో ఏక్ హసీనా, బద్లాపూర్ లాంటి డార్క్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ దీన్ని రూపొందించారు.

    ఆ సంస్థ తొలి చైనా రిలీజ్

    ఆ సంస్థ తొలి చైనా రిలీజ్

    ‘మా సంస్థ నుంచి చైనాలో తొలిసారి విడుదలైన అంధాధున్‌ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. అక్కడ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మా భాగస్వామి ట్యాంగ్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేశాం. వసూళ్లు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నాం' అని వయాకామ్ 18 స్టూడియో సీఓఓ అజిత్ అంధరె ఒక స్టేట్మెంట్లో పేర్కొన్నారు.

    భారతీయ సినిమాలకు చైనాలో ఆదరణ, త్వరలో మరో తెలుగు మూవీ విడుదల

    భారతీయ సినిమాలకు చైనాలో ఆదరణ, త్వరలో మరో తెలుగు మూవీ విడుదల

    ఇండియన్ సినిమాలకు చైనాలో ఈ మధ్య కాలంలో ఆదరణ పెరుగుతోంది. అమీర్ ఖాన్ ‘దంగల్', సల్మాన్ ఖాన్ మూవీ ‘భజరంగీ భాయి జాన్', ఇర్ఫాన్ ఖాన్ ‘హిందీ' మీడియం చిత్రాలు అక్కడ ఘన విజయం సాధించాయి. నాని నటిస్తున్న ‘జెర్సీ' మూవీ కూడా త్వరలో చైనాలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Actor Ayushmann Khurrana’s hit film AndhaDhun has earned Rs 106 cr in China just six days. Film trade analyst Taran Adarsh tweeted the new figures on Tuesday. “#AndhaDhun stays super-strong on the crucial Mon, after an *extended* weekend in #China [opened on Wed]... Crosses $ 15 mn [100 cr]... Also crosses India *lifetime biz* [Gross BOC] in *6 days*... Mon $ 1.45 mn. Total: $ 15.25 mn [Rs 106.09 cr],” he wrote in his tweet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X