Andhra King Taluka Closing Collections: ఆంధ్రా కింగ్ తాలూకా క్లోజింగ్ కలెక్షన్స్.. రామ్ మూవీకి లాభమా? నష్టమా?

వరుస పరాజయాల్లో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రేసులో నిలబడాలంటే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో చేసిన సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. మహేశ్ పాచిగోళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ నిర్మించారు. మరాఠీ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ భోర్సే ఈ చిత్రంలో రామ్ సరసన హీరోయిన్‌గా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో ఇతర పాత్రల్లో నటించారు. ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్‌ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. వివేక్- మెర్విన్‌లు స్వరాలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? క్లోజింగ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లు? రామ్ పోతినేని మూవీకి లాభమా? నష్టమా? ఈ వివరాలు పరిశీలిస్తే..

ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్ & బ్రేక్‌ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, పబ్లిసిటీ, ఇతర ఖర్చులన్నీ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు 70 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో రామ్ పోతినేని మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Andhra King Taluka Box Office Closing Collections Worldwide How much loss or profit for Ram Pothineni s Movie

ఆంధ్రా కింగ్ తాలూకా కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు తొలి రోజున 4.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.1 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.65 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.7 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.35 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.05 కోట్ల రూపాయలు, ఏడో రోజున 90 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 75 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 78 లక్షల రూపాయలు, పదో రోజున 1.47 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 1.14 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా 21.34 కోట్ల రూపాయల నెట్.. 23.6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

తెలుగు రాష్ట్రాలలో తొలి రోజున 4.13 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.06 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.63 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.68 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.29 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.04 కోట్ల రూపాయలు, ఏడో రోజున 89 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 74 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 78 లక్షల రూపాయలు, పదో రోజున 1.47 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 1.14 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ 5.20 కోట్ల వరకు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్+ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రామ్ పోతినేని మూవీకి 12 రోజుల్లో 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 21.20 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2.29 కోట్ల రూపాయలు, తమిళనాడులో 50 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 5.20 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున వసూలు చేసింది.

Andhra King Taluka Box Office Closing Collections Worldwide How much loss or profit for Ram Pothineni s Movie

ఆంధ్రా కింగ్ తాలూకాకి లాభమెంత? నష్టమెంత?
వరుస ఫ్లాపులతో ఉన్న రామ్ .. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో హిట్ బాట పట్టాలని ఆశపడ్డారు. 60 కోట్ల రూపాయల గ్రాస్.. 30 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ టార్గెట్‌గా బరిలోకి దిగిన రామ్ పోతినేని మూవీకి తొలి రెండు రోజులు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాతి నుంచి పరిస్ధితి దారుణంగా తయారైంది. వీకెండ్ నెట్టుకొచ్చిన ఆంధ్రా కింగ్.. వర్కింగ్ డేస్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సేలతో పాటు చిత్ర యూనిట్ మొత్తం అమలాపురం నుంచి అమెరికా దాకా గట్టి ప్రమోషన్స్ చేసినా ఫలితం దక్కలేదు.

మధ్యలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ వాయిదాపడటంతో గత వీకెండ్‌‌లో పర్వాలేదనే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. అయితే సోమవారం నుంచి మరోసారి వర్కింగ్ డేస్ మొదలు కానుండటంతో ఆంధ్రా కింగ్‌‌కు మరోసారి కష్టాలు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే.. 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కు గాను కేవలం 30 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం దాదాపు 30 కోట్ల రూపాయల భారీ నష్టాల్ని మిగిల్చింది. అలాగే 30 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్‌కు గాను 18 కోట్లు రాబట్టి 12 కోట్ల నష్టాన్ని తీసుకొచ్చింది ఆంధ్రా కింగ్ తాలూకా. ఈ వారం నుంచి నెలాఖరు వరకు క్రేజీ సినిమాలు లైనులో ఉండటంతో రామ్ పోతినేని మూవీ ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

ఇక ఆంధ్రా కింగ్ తాలూకా కోసం మైత్రీ మూవీ మేకర్స్ 70 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేయగా.. కనీసం దానిలో సగం కూడా వసూలు కాకపోవడంతో నిర్మాణ సంస్థకు భారీ నష్టాలు తప్పవని భావిస్తున్నారు. అయితే ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాతలు స్వల్ప నష్టాలతో బయటపడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X