Andhra King Taluka Business: షాకింగ్‌గా ఆంధ్రా కింగ్ తాలుకా బిజినెస్.. రామ్ పొతినేనికి ఆ విషయం కలిసి వస్తుందా?
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై పాపులర్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలుకా. ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు పీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, యువ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
రొమాంటిక్ లవ్ స్టోరి, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు సిద్దార్థ నూని సినిమాటోగ్రఫిని, వివేక్- మెర్విన్ మ్యూజిక్ ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు.ఈ చిత్రం నవంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ ఎంత? ఈ మూవీకి జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ఆంధ్రా కింగ్ తాలుకా చిత్రం సినీ అభిమాని బయోపిక్. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఆన్ స్క్రీన్ సూపర్ స్టార్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయనకు అభిమానిగా సాగర్ అనే పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నాడు. అయితే ఓ స్టార్ హీరో, తన అభిమానికి ఉండే బాండింగ్ నేపథ్యంగా సాగే ఎమోషనల్ జర్నీ ఈ సినిమా. మహాలక్ష్మీ అనే పాత్రలో భాగ్యశ్రీ భోర్సే నటిస్తున్నారు. సాగర్, మహాలక్ష్మీ పాత్రల మధ్య లవ్, రొమాన్స్ కెమిస్ట్రీ అదిరిపోతుందని పాటలు స్పష్టం చేశాయి.
రామ్, ఉపేంద్ర, భాగ్యశ్రీ లాంటి స్టార్స్, టాలెంటెడ్ టెక్నిషియన్స్ కలిసి పనిచేసిన ఈ చిత్రాన్ని భారీగా బడ్జెట్‌తో నిర్మించారు. ప్రొడక్షన్ కాస్ట్, రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను 70 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలకు మంచి క్రేజ్ రావడంతో ఈ సినిమా బిజినెస్ కూడా క్రేజీగానే జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాకు ముందు రామ్ పోతినేని నటించిన ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆదరణ పొందలేదు. దాంతో ఈ సినిమా బిజినెస్‌పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ సందేహాలకు తగినట్టుగానే ఈ సినిమా బిజినెస్ గొప్పగా జరగకపోవడం రామ్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. తక్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించడం సానుకూలమైన అంశం అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నారు.
ట్రేడ్ వర్గాలు వెల్లడించిన ప్రకారం.. ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ సుమారుగా 27 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. రామ్ ఈ లక్ష్యాన్ని సునాయసంగా అందుకోవడం సాధ్యమే అని పేర్కొంటున్నారు. కాకపోతే ఈ సినిమాకు అఖండ 2, బైకర్ సినిమాల నుంచి భారీ పోటీ ఉండటంతో ఈ మూవీ కలెక్షన్లపై ఆసక్తి పెరిగింది.


Click it and Unblock the Notifications











