Andhra King Taluka Day 1 Collections: ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్స్... రామ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
మహేశ్ బాబు పాచిగోళ్ల దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి ఈ ఆంధ్రా తాలూకా సినిమాను నిర్మించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. వివేక్- మెర్విన్‌లు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రింట్స్, ప్రమోషనల్, ఇతర ఖర్చులన్నీ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు 70 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్లు, పాటలతో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు మంచి ప్రీ బిజినెస్ జరిగింది. ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా దాదాపు 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రామ్ పోతినేని మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

ఆంధ్రా కింగ్ తాలూకా ఓవర్సీస్ కలెక్షన్స్
గడిచిన ఆరేళ్లుగా హిట్ లేకపోవడంతో ఈ సినిమాపై రామ్ పోతినేని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగినట్లుగానే ఆంధ్రా కింగ్ తాలూకా కోసం కష్టపడ్డాడు. ప్రతి చిన్న ఈవెంట్‌లోనూ పాల్గొని సినిమాపై హైప్ తీసుకురావడానికి కృషి చేశారు. దానికి తగినట్లుగానే ఆంధ్రా కింగ్ తాలూకాకు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి పర్ఫార్మెన్స్ చేసింది. రిలీజ్‌కు రెండు రోజుల ముందే యూఎస్ఏలో 40 వేల డాలర్లు (భారత కరెన్సీలో 35.72 లక్షల రూపాయలు) మార్క్ చేరుకుంది.
ఇక ఆంధ్రా కింగ్ తాలూకా ప్రీమియర్స్ విషయానికి వస్తే.. రామ్ పోతినేని సినిమాకు అమెరికాలోని 211 లోకేషన్స్‌కు గాను 412 షోలు పడ్డాయి. మొత్తం 5908 టికెట్స్ అమ్ముడై.. తద్వారా 83,895 రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. 27వ తేదీ సాయంత్రం నాటికి ఇది 150K డాలర్లు (భారత కరెన్సీలో 1.33 కోట్ల రూపాయలు) వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రా కింగ్ తాలూకా తొలి రోజు కలెక్షన్స్
70 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లక్ష్యంతో బరిలో దిగిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. తొలి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు రామ్ పోతినేని సినిమాకు 30 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 439 షోలు, బెంగళూరులో 316 షోలు, విజయవాడలో 100 షోలు, విశాఖపట్నంలో 115 షోలు ప్రదర్శితమయ్యాయి. ఫస్ట్ షో, సెకండ్ షో నాటికి బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకాకు ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 2.50 కోట్ల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











