Andhra King Taluka Day 11 Collections: నష్టాల్లోనే ఆంధ్రా కింగ్ తాలూకా.. రామ్ పోతినేని మూవీకి ఇంకెంత రావాలంటే?

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మరాఠీ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించారు. నవంబర్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. మహేశ్ పాచిగోళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటించారు. ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్‌ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. వివేక్- మెర్విన్‌లు స్వరాలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 11వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే? ఈ వివరాల్లోకి వెళితే..

ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, పబ్లిసిటీ, ఇతర ఖర్చులన్నీ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు 70 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో రామ్ పోతినేని మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Andhra King Taluka Day 11 Expected Box Office Collections Worldwide Ram Pothineni s Movie still struggle to avoid being a failure

ఆంధ్రా కింగ్ తాలూకా 10 రోజుల కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు తొలి రోజున 4.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.1 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.65 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.7 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.35 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.05 కోట్ల రూపాయలు, ఏడో రోజున 90 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 75 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 78 లక్షల రూపాయలు, పదో రోజున 1.47 కోట్ల రూపాయలు చొప్పున 10 రోజుల్లో ఇండియా వైడ్‌గా 20.85 కోట్ల రూపాయల నెట్.. 21.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది.

తెలుగు రాష్ట్రాలలో తొలి రోజున 4.13 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.06 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.63 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.68 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.29 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.04 కోట్ల రూపాయలు, ఏడో రోజున 89 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 74 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 78 లక్షల రూపాయలు, పదో రోజున 1.47 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ 5 కోట్ల వరకు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్+ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రామ్ పోతినేని మూవీకి 27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 20.85 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2.20 కోట్ల రూపాయలు, తమిళనాడులో 50 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున వసూలు చేసింది.

ఆంధ్రా కింగ్ తాలూకా 11వ రోజు కలెక్షన్స్
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనుల అఖండ 2 చిత్రం అనూహ్యంగా వాయిదా పడటం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు ప్లస్ అయ్యింది. తెలుగులో మరో పెద్ద సినిమా లేకపోవడంతో ఆంధ్రా కింగ్‌కు కలిసొచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో రామ్ పోతినేని సినిమాకు వసూళ్లు పెరిగాయి. 11వ రోజైన ఆదివారం మంచి బుకింగ్స్ జరిగాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు 24 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ రోజు కడపటి సమాచారం అందే నాటికి ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి 82 లక్షల రూపాయలు వసూలైంది. 11వ రోజు రామ్ పోతినేని సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 30 లక్షల రూపాయల చొప్పున 1.30 కోట్ల రూపాయలు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దాంతో ఇప్పటి వరకు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి వరల్డ్ వైడ్‌గా 21 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. భారీగా కలెక్షన్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X