Andhra King Taluka Day 2 Collections: ఆంధ్రా కింగ్‌ తాలూకా కలెక్షన్ల జోరు... రెండో రోజు రామ్ మూవీకి ఎంతంటే?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. మహేశ్ బాబు పాచిగోళ్ల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటించారు. ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్‌ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. వివేక్- మెర్విన్‌లు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, పబ్లిసిటీ, ఇతర ఖర్చులన్నీ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు 70 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్లు, పాటలతో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు ప్రీ బిజినెస్ బాగానే జరిగింది. ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా దాదాపు 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రామ్ పోతినేని మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 650 స్క్రీన్‌లలో, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లలో 1300 స్క్రీన్లు చొప్పున 1950 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

Andhra King Taluka Day 2 Expected Box Office Collections Worldwide Ram Pothineni s Movie continues as it scores

ఆంధ్రా కింగ్ తాలూకా తొలి రోజు కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు తొలి రోజు ఇండియాలో 4.15 కోట్ల రూపాయల నెట్.. 4.85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తొలిరోజున కర్ణాటకలో 45 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 4.25 కోట్ల రూపాయలు, తమిళనాడులో 8 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 7 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసింది.

ఆంధ్రా కింగ్ తాలూకా ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక ఓవర్సీస్‌లో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు నార్త్ అమెరికాలో అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. తొలిరోజున రామ్ పోతినేని సినిమాకు 275K డాలర్లు (భారత కరెన్సీలో 2.46 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ఆంధ్రా కింగ్ తాలూకాకు నార్త్ అమెరికాలో డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోన్న ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. ఇది హీరో రామ్ కెరీర్‌లో నార్త్ అమెరికాలో హయ్యెస్ట్ ఓపెనింగ్స్‌గా తెలిపింది. యూరప్, యూకే, గల్ఫ్ మిడిల్ ఈస్ట్ దేశాలలో తొలి రోజున ఈ సినిమాకు మరో 30 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. దాంతో ఆంధ్రా కింగ్ తాలూకాకు తొలిరోజున ఓవర్సీస్ నుంచి 2.75 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్ కలెక్షన్స్ + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి రామ్ పోతినేని సినిమాకు తొలి రోజున 7.5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి.

ఆంధ్రా కింగ్ తాలూకా రెండో రోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు రెండో రోజు మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రెండో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు తెలుగు వెర్షన్‌లో 18 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. రెండో రోజు రామ్ పోతినేని మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 1.50 కోట్ల రూపాయలు చొప్పున 6 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X